https://oktelugu.com/

ఏపీ డీజీపీ ఉగ్రరూపం.. పచ్చపార్టీ నేతలకు గట్టి వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో డీజీపీ గౌతం సవాంగ్ సీరియర్ గా ఉన్నారు.. ప్రభుత్వాన్ని, పోలీసు డిపార్ట్ మెంట్ ను టార్గెట్ చేస్తూ పచ్చపార్టీ నాయకులు చేస్తున్న పిచ్చి చర్యలను తీవ్రంగా ఖండించారు డీజీపీ. దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. ఇకపై అలాంటి పిచ్చి పనులు చేసేవారి తాట తీయాలని సూచించారు. ఈ మేరకు.. మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 20, 2021 / 03:39 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో డీజీపీ గౌతం సవాంగ్ సీరియర్ గా ఉన్నారు.. ప్రభుత్వాన్ని, పోలీసు డిపార్ట్ మెంట్ ను టార్గెట్ చేస్తూ పచ్చపార్టీ నాయకులు చేస్తున్న పిచ్చి చర్యలను తీవ్రంగా ఖండించారు డీజీపీ. దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. ఇకపై అలాంటి పిచ్చి పనులు చేసేవారి తాట తీయాలని సూచించారు. ఈ మేరకు.. మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన జిల్లాల ఎస్పీలు, కమిషనర్‌లతో వెబినార్‌ నిర్వహించారు.

    Also Read: బీచ్‌ రోడ్డు బిల్డింగుల పని అయిపోయినట్లే..!

    రాష్ట్రంలో జరుగుతున్న ఆలయ ఘటనల పట్ల ఏ మాత్రం అలక్ష్యం వహించవద్దని, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాటిని ఛేదించి మత సామరస్యాన్ని కాపాడాలని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఘటనలపై కేసుల నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్టులతోపాటు గ్రామ రక్షణ దళాల (విలేజ్‌ డిఫెన్స్‌ స్క్వాడ్స్‌) ఏర్పాటుపై సమీక్షించారు. ఆలయాల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.

    రాష్ట్రంలో పథకం ప్రకారం జరిగే ఆలయ విధ్వంస ఘటనలకు అడ్డుకట్ట వేసేలా సమన్వయంతో పని చేయాలన్నారు. ఆలయాలపై దాడుల్లో రాజకీయ దురుద్ధేశాలు బయట పడుతున్నందున, ఆయా ఘటనల్లో రాజకీయ ప్రమేయాన్ని ఏ మాత్రం ఉపేక్షించవద్దన్నారు. సమాజంలో దేవుడి సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని అలజడి రేపి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసే వారిని ఆధారాలతో సహా గుర్తించి ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు.

    Also Read: ఎల్ఆర్ఎస్ పై హైకోర్టు సంచలన నిర్ణయం

    రాజకీయ లబ్ధి కోసం మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా జరిగే కుట్రలను ఛేదించి, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడకూడదని సూచించారు. సెప్టెంబర్‌ తర్వాత జరిగిన ఘటనల దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసిందని, సిట్‌తోపాటు రెవెన్యూ, దేవదాయ శాఖలతో పోలీసు శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు.

    గ్రామాల్లో దేవాలయాలు, మతపరమైన సంస్థల రక్షణకు ప్రజల సహకారం తీసుకోవాలన్నారు. గత నాలుగు నెలల్లో 59,529 మత పరమైన సంస్థలను గుర్తించి జియో ట్యాగింగ్‌ చేశామని వివరించారు. ఇప్పటి వరకు 16,712 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశామని, 212 కేసుల్లో 180 కేసులను ఛేదించి 337 మందిని అరెస్టు చేశామని వివరించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్