RWF Recruitment 2021: భారతీయ రైల్వేకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 192 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9 ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.
https://rwf.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 192 ఉద్యోగ ఖాళీలలో ఫిట్టర్- 85, ఎలక్ట్రీషియన్- 18, ఎలక్ట్రానిక్ మెకానిక్- 22, మెకానిక్ (మోటార్ వెహికిల్)- 8, టర్నర్- 5, సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్)- 23 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆఫ్ లైన్ లో ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ది సీనియర్ పర్సనల్ ఆఫీసర్ పర్సనల్ డిపార్ట్‌మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, యెలహంక, బెంగళూరు- 560064 అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది. ఇతర అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. https://rwf.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.