హుజురాబాద్ లో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. రాజకీయ పార్టీల్లో చలనం మొదలైంది. జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై మాట్లాడటానికి బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బుధవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు సమాచారం. ఉప ఎన్నికలో అవలంభించబోయే ఎన్నిక వ్యూహంపై ప్రముఖంగా చర్చించే అవకాశం ఏర్పడింది. దీంతో అందరి దృష్టి వారి భేటీ పైనే పడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం భేటీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ డబ్బు పంపిణీ ప్రధానంగా చేపట్టబోయేఅవకాశం ఉందని తెలుస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రత్యేక అధికారిని నియమించి డబ్బు మద్యం పంపిణీని అడ్డుకోవాలని చూస్తోంది. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్ని శాసించే టీఆర్ఎస్ నిజ స్వరూపం బయటపెట్టే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్యాహ్నం ఢిల్లీలో అమిత్ షాతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాజా రాజకీయ స్థితిగతులపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. హుజురాబాద్ లోని పరిస్థితిని సంజయ్, ఈటల అమిత్ షాకు వివరించే అవకాశం ఉంది. దుబ్బాక మాదిరి ఇక్కడ కూడా బీజేపీనే విజయం సాధించాలనే తపనతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రత్యర్థి పార్టీలను అధిగమించి భారీ విజయానని నమోదు చేసేందుకు పావులు కదుపుతున్నాయి.
తెలంగాణలో బీజేపీ పట్టు సాధించేందుకు హుజురాబాద్ ఎన్నిక ఉపయోగపడనుంది. దీంతో ముందస్తు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించే క్రమంలో అనుసరించబోయే పద్ధతులను చెబుతున్నారు. ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసే వ్యూహాలను ఖరారు చేయాలని సూచించింది.
హుజురాబాద్ లో పట్టు బిగించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ నేతలుఇప్పటికే హుజురాబాద్ లోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడే ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈనేపథ్యంలో గెలుపు గుర్రాల కోసం పార్టీలు వెతుకుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ప్రకటించడంతో టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ కూడా తన అభ్యర్థి ఎవరనే విషయం ఇంకా నిర్ధారించుకోలేదు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికపై కేంద్రం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వస్తుందో తెలియని పరిస్థితి. బుధవారం నిర్వహించే భేటీలో సంజయ్, ఈటల రాజేందర్ తోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.