https://oktelugu.com/

‘ముసలోడి’తో పెళ్ళి పై యంగ్ బ్యూటీ వివరణ !

బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌ కి ఐదు పదుల వయసు దాటింది. అయినా ఫిట్‌ గా ఉంటూ ప్రేమ విషయంలో కుర్రాళ్లకు పోటీని ఇస్తున్నాడు. తనకన్నా 26 ఏళ్లు చిన్నదైన అంకిత కొన్వర్‌ ను పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు. అయితే, జరిగిపోయిన ఈ తంతును ఇప్పుడు ఎందుకు అంటే.. తాజాగా ఈ దౌర్బాగ్యం గురించి ఓ నెటిజన్‌ అంకితను సూటిగా సుత్తి లేకుండా సుతిమెత్తగా ప్రశ్నించాడు. ‘ముసలోడిని పెళ్లి చేసుకోకూడదు అని బలంగా నమ్మే […]

Written By: , Updated On : June 10, 2021 / 04:31 PM IST
Follow us on

Ankita Konwarబాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌ కి ఐదు పదుల వయసు దాటింది. అయినా ఫిట్‌ గా ఉంటూ ప్రేమ విషయంలో కుర్రాళ్లకు పోటీని ఇస్తున్నాడు. తనకన్నా 26 ఏళ్లు చిన్నదైన అంకిత కొన్వర్‌ ను పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు. అయితే, జరిగిపోయిన ఈ తంతును ఇప్పుడు ఎందుకు అంటే.. తాజాగా ఈ దౌర్బాగ్యం గురించి ఓ నెటిజన్‌ అంకితను సూటిగా సుత్తి లేకుండా సుతిమెత్తగా ప్రశ్నించాడు.

‘ముసలోడిని పెళ్లి చేసుకోకూడదు అని బలంగా నమ్మే భారతీయుల మూస ఆలోచనా ధోరణిని నువ్వు ఎలా ఎదుర్కొన్నావ్ ? అంటూ యంగ్ బ్యూటీని నిలదీసాడు. మరి ముదురు మోడల్ మిలింద్‌ సోమన్‌ సానిహిత్యంలో ఆరితేరిపోయిన అంకిత బదులిస్తూ.. ‘సమాజంలో జరిగే అసాధారణ విషయాల గురించి మాట్లాడేందుకు ప్రజలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది.

అంకిత కొన్వర్‌ ముసలాడు అయిన మిలింద్‌ ను పెళ్లాడటం అసాధారణమైన విషయం అట. ఇక ఇలాంటి వ్యవహారాల పై విమర్శలు ఒక్క భారత్‌ లోనే కాదు, అన్ని దేశాల్లోనూ ఉన్నాయి అని తెలిపింది. ఇంకా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ‘మనందరిలో నైపుణ్యాలు ఉన్నా.. దానివల్ల మంచి, చెడుకు మధ్య వ్యత్యాసం తెలుసుకోగలిగేంత స్పృహ మనలో చాలామందికి లేదు.

అయితే, నేను మాత్రం నాకెప్పుడూ సంతోషాన్నిచ్చే పనులే చేసుకుంటూ పోయాను’ అని సగర్వంగా తెలుపుకుంది. నిజానికి మిలింద్‌ ను అంకిత పెళ్లి చేసుకోవడానికి కారణం, ఆమెకు జీవితంలో ఎదురైన కష్టాలే. అంకితకు పెళ్లి కాకముందు ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉండేవాడు. అయితే అతడు ఓ ప్రమాదంలో మరణించాడు. ఆమె ఉద్యోగరీత్యా చెన్నైకి రావాల్సి వచ్చింది.

అక్కడ అంకిత, మిలింద్‌ ను చూసింది. ఆ సమయంలో ఇద్దరి చూపులు కలిశాయి. ఆ తరువాత వీరి ప్రేమ మొదలైంది. 2018లో వీరి వివాహం జరిగింది. అప్పుడు మిలింద్‌ వయసు 52 కాగా అంకిత వయసు 26 ఏళ్లు మాత్రమే. అయినా పెళ్లి చేసుకుని ఇద్దరు సుఖంగా ఉన్నారు.