మే నెలాఖరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏర్పాటు చేసిన మంత్రి వర్గ సంఘం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ నెల 12న భేటీ కావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో కరోనా చికిత్సకు అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ ఔషధాలపై పన్నులు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.