
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గతంలో పలు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసిన ఈ సంస్థ తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, ఉపాధి రంగాలకు పెద్దపీట వేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఏకంగా 4లక్షల ఉద్యోగ ఖాళీలను జగన్ భర్తీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ సంస్థలలో వరుస జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సంస్థ జాబ్ మేళాలతో పాటు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లను కూడా నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. ఈ నెల 13వ తేదీన ఈ సంస్థ భారీ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేస్తోంది. అనంతపూర్ లోని నలంద డిగ్రీ కాలేజ్, రామ్ నగర్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు అనంతపురం మరియు శ్రీసిటీలో పని చేయాల్సి ఉంటుంది. https://apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. హీరో మోటార్స్, ముత్తూట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 10,500 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. 19 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.