కేంద్రం సూపర్ స్కీమ్.. రూపాయి డిపాజిట్ తో రూ.2 లక్షలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తక్కువ డిపాజిట్లతో ఎక్కువమొత్తం ఆదాయం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే పథకాలను కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాల్లో చేరడం వల్ల కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ కూడా […]

Written By: Kusuma Aggunna, Updated On : August 11, 2021 9:35 pm
Follow us on


కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తక్కువ డిపాజిట్లతో ఎక్కువమొత్తం ఆదాయం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే పథకాలను కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాల్లో చేరడం వల్ల కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది.

కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ కూడా ఒకటి. జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అమలులో ఉండే ఈ స్కీమ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కావడం గమనార్హం. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు సంవత్సరానికి 12 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు కేవలం రూపాయి చెల్లించడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

పీఎం సురక్ష బీమా యోజన స్కీమ్ ప్రీమియం డబ్బులు బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల బ్యాంక్ అకౌంట్ లో 12 రూపాయలు ఉండే విధంగా డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రూ.2 లక్షల రూపాయలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. పాక్షికంగా అంగ వైకల్యం సంభవిస్తే లక్ష రూపాయలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు పొందవచ్చు.

18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఖాతాను క్లోజ్ చేస్తే మాత్రం పాలసీ రద్దయ్యే అవకాశాలు ఉంటాయి.