ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. అమెరికన్లు తమ అధ్యక్షుడు ఎవరనేది బ్యాలెట్ బాక్సుల్లో వేసేశారు. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
తొలుత పోలింగ్ పూర్తయిన చిన్న రాష్ట్రాల్లో ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విజయం సాధించి ఇరువురు అభ్యర్థులు ట్రంప్, జోబైడెన్ ధీమాగా ఉన్నారు. మునుపెన్నడూ లేనంతా అమెరికా ఎన్నికల ఓటింగ్ కు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇప్పటికే 10 కోట్ల మంది మెయిల్ బ్యాలెట్ల ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక నేరుగా కూడా పోలింగ్ బూత్ లలో ఓటు వేయడానికి ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు.
Also Read: అమెరికాలో రెండు పార్టీలే ఎందుకు ఉంటాయి?
*డొనాల్డ్ ట్రంప్ గెలిచిన రాష్ట్రాలివీ
కీలక రాష్ట్రాలు పెద్ద ఓటు బ్యాంకు ఫ్లోరిడా, జార్జియాలో ట్రంప్ ముందంజలో ఉండడం విశేషం. ఇక వెస్ట్ వర్జీనియా, కెంటకీ, సౌత్ కరోలైనా, ఒక్లహామా, అర్కన్సాస్, టెన్నెసీ, ఇండియానా, మిస్సిసీపీ, అలబామాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. మిషిగాన్, మెనీ రాష్ట్రాల్లోనూ ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది.
*బైడెన్ గెలిచిన రాష్ట్రాలివీ..
మేరిలాండ్, డెలావెర్, న్యూజెర్సీ, కనెక్టీకట్, మాసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, వర్జీనియా, వెర్మాంట్, ఇల్లినాయాస్ రాష్ట్రాలను జో బైడెన్ గెలుపొందారు. టెక్సాస్, కాన్సాస్, మిస్సౌరి, ఒహైయో, పెన్సిల్వేనియా, న్యూహ్యాంప్ షూర్, నార్త్ కరోలైనా రాష్ట్రాల్లో ప్రస్తుతం జోబైడెన్ ముందంజలో ఉన్నారు.
Also Read:బిహార్ భవితవ్యం తేల్చనున్న రెండో విడత ఎన్నికలు
చివరంగా జోబైడెన్ ఇప్పటివరకు 85 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు సాధించి ముందంజలో ఉండగా.. ట్రంప్ 72 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు సాధించారు. పాపులర్ ఓట్లలో ట్రంప్ ఆధిక్యత కనబరుస్తున్నారు.
మొత్తం 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు గాను 270 ఓట్లు సాధించి అభ్యర్థి విజయం సాధిస్తారు. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే జోబైడెన్ గెలవడం ఖాయమంటున్నారు.