అమెరికా కౌంటింగ్ క్లైమాక్స్: కీలకంగా ఆ రాష్ట్రం.. విజేతలు ఎవరు?

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనాలోనైతే జనాలు , నేతలు లైవ్ చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక భారత్ లో , యూరప్ సహా అన్ని దేశాల్లో ట్రంప్ రెండోసారి గెలుస్తాడా? బిడెన్ నెగ్గుతాడా అన్నది ఉత్కంఠ రాజేస్తోంది. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు బుధవారం రాత్రి వరకు అందిన సమాచారం.. జోబిడెన్ 238 స్థానాలు, డొనాల్డ్ ట్రంప్ 213 ఎలక్ట్రోరల్ ఓట్లు […]

Written By: NARESH, Updated On : November 5, 2020 9:59 am
Follow us on

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనాలోనైతే జనాలు , నేతలు లైవ్ చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక భారత్ లో , యూరప్ సహా అన్ని దేశాల్లో ట్రంప్ రెండోసారి గెలుస్తాడా? బిడెన్ నెగ్గుతాడా అన్నది ఉత్కంఠ రాజేస్తోంది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

బుధవారం రాత్రి వరకు అందిన సమాచారం.. జోబిడెన్ 238 స్థానాలు, డొనాల్డ్ ట్రంప్ 213 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించాడు. బిడెన్ ప్రస్తుత స్వల్ఫ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా కీలకమైన రాష్ట్రాల్లో ఫలితాలు తేలాల్సి ఉంది.

ఒక్కో రాష్ట్రం ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇందులో ఆధిక్యం గంటగంటకు చేతులు మారుతోంది. అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి జోబిడెన్ మధ్య ఆధిపత్యం క్షణక్షణం మారుతోంది. విజయం అనేది దోబూచులాడుతోంది. ఇద్దరూ హోరాహోరీ తలపడుతున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాల్లో గంటగంటకు ఫలితాల సరళి మారుతోంది. దీంతో అమెరికాలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ప్రపంచదేశాలన్నీ అమెరికా అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

Also Read: ఫలితాలు రాకముందే ప్లేట్ ఫిరాయించిన ట్రంప్

ఇప్పటిదాకా ఫలితాలు తేలిన రాష్ట్రాల వారీగా చూస్తే.. ట్రంప్ , జోబిడెన్ హోరాహరీ కనిపిస్తోంది. పెన్సిల్వేనియాలో ఎలక్టోరల్ ఓట్లు -20 ఉన్నాయి. ఇక్కడ బిడెన్, ట్రంప్ హోరాహోరీ ఉంది. ఎవరికి మెజార్టీ వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇక్కడ గెలిచిన వారే అమెరికా అధ్యక్షుడు అయ్యేలా ఉన్నాడు. అలస్కా (ఎక్టోరల్ ఓట్లు -3):ఇక్కడ ట్రంప్ మెజార్టీలో ఉన్నారు.

ఇక జార్జియాలో 16 ఓట్లు ట్రంప్ కు వచ్చే అవకాశం ఉంది. నార్త్ కరోలినాలో ట్రంప్ కు 15 ఓట్లు రావచ్చంటున్నారు. విస్కాన్సిన్ ఎలక్టోరల్ ఓట్లు -10 ఇక్కడ ట్రంప్ కే మెజార్టీ ఉంది. మిచిగాన్ ఎలక్టోరల్ ఓట్లు-16 : ట్రంప్, జోబిడెన్ హోరాహోరీ నడుస్తోంది. నెవెడా (ఎలక్టోరల్ ఓట్లు-6): ఇక్కడ జోబిడెన్ కే అనుకూలంగా ఉంది.  ఓవరాల్ గా విస్కాన్సిన్, జార్జియా, నార్త్ కరోలినా, ట్రంప్ ఖాతాలోకి వస్తే 257 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక మిచిగాన్, నెవెడా జోబిడెన్ ఖాతాలోకి వస్తే.. 260 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య కేవలం 3 ఓట్ల తేడా మాత్రమే ఉండనుంది.

Also Read: బీహార్‌‌ ఎన్నికలు: మోడీ వరాలు.. అక్కడి ప్రజలు నమ్మేనా..!

హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారన్నది సస్పెన్స్ గా మారింది.. పెన్సిల్వేనియా కీలకంగా మారింది. ఇక్కడ ఎవరు గెలిస్తేవారిదే అధికారం. చాలా తక్కువ మెజార్టీతోనే ఎవరైనా గెలుస్తారు.