
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రెండోసారి అరెస్ట్ అయ్యాడు. ఇంకొంతమంది మాజీ మంత్రులు జైలు పాలయ్యారు. ఇప్పుడు నెక్ట్స్ ఎవరు అంటే ఖచ్చితంగా చంద్రబాబు అంటున్నారు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఏపీలో ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లడానికి టీడీపీ, ఎల్లో మీడియాలు ఒక అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ అచ్చెన్నాయుడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు..? కచ్చితంగా నేరానికి పాల్పడ్డారనే అరెస్ట్ చేశారన్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సొంత అన్న కుమారుడిపైనే బెదిరింపులు దిగితే అరెస్ట్ చేయరా అని వ్యాఖ్యానించారు. ఒక్క అచ్చెన్నాయుడే కాదు తప్పు చేస్తే చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాల్సిందే అది పోలీసుల విధి నిర్వహణ అని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు హోంమంత్రి అయ్యి పోలీసుల తాట తీస్తాడట.. పాపం అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నాడని ఎద్దేవ చేశారు. చంద్రబాబు ప్రధానిలా, ఆయన హోంమంత్రిలా… నిమ్మగడ్డ పంచాయతీ మంత్రిలా పగటి కలలు కంటున్నారని విమర్శించారు.
Also Read: పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబే.. సజ్జల సంచలన ప్రకటన
ఇంతకు ముందు కూడా పట్టాభిపై దాడి జరిగిందని అంబటి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కారే ధ్వంసం అవుతుందా అని ప్రశ్నించారు. దాడి ఎవరి మీద జరిగినా ఖండించాల్సిందేనన్నారు. చంద్రబాబు వచ్చే వరకూ టీవీల్లో మాట్లాడిన పట్టాభి.. ఆయన వచ్చాక మంచం ఎక్కి నాటకం ఆడుతున్నారని అన్నారు. చిన్న దాడి జరిగితే చంపేస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని.. బాబు చచ్చిన పాము.. ఇక ఆయనను చంపేంత పిచ్చోళ్లం తాము కాదని వ్యాఖ్యానించారు. గొల్లలపెంటలోని ఆత్మహత్య సంఘటన బాధితులను ఎన్నికల కమిషన్ పరామర్శించడం ఏంటని? ఈ సందర్భంగా అంబటి ప్రశ్నించారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత నిమ్మగడ్డకు ఉంది కాని ఆయన అక్కడకు ఎందుకు వెళ్లారన్నారు.
నారా లోకేష్‌కు పైలెట్‌గా వెళ్లారా.. అయినా విచారణ చేయాల్సిన బాధ్యత పోలీసులది అన్నారు. ఎవరి బాధ్యత వారు చేయాలని, ఒక ఎన్నికల కమిషనర్ వెళ్లడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన అన్నారు. చంద్రబాబు, లోకేష్, నిమ్మగడ్డ కలిసి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, నిమ్మగడ్డ యాప్ అంతా ఒట్టి బూటకమని పేర్కొన్నారు.
Also Read: పంచాయతీ ఎన్నికల్లో నోట్ల హవా: అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు
గతంలో టీడీపీ కార్యాలయంలోనే ఒక లెటర్ తయారయ్యిందని, టీడీపీ వారిని గెలిపించాలనే తాపత్రయంతోనే ఈ యాప్‌ను కూడా టీడీపీ కార్యాలయింలోనే తయారు చేసుంటారని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ యాప్ ఏకగ్రీవంపై గ్రామాల్లోని ప్రజలను ఎన్నికల కమిషన్ ప్రశంసించాలన్నారు. అచ్చెన్నాయుడులా ఏకగ్రీవాలు చేస్తే తప్పు కానీ.. ప్రజలంతా కలిసి ఏకగ్రీవం చేసుకుంటే తప్పేముందన్నారు. ఎన్నికల కమిషన్ తమ జేబు సంస్థ అన్నట్లు టీడీపీ మాట్లాడుతోందన్నారు. శాసన సభకు ఆ హక్కు ఉందని, శాసన సభ విషయంలో సభ్యుల హక్కు కోసం సభ నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా టీడీపీ వారు గొంతెత్తున్నారని చెప్పారు. అంటే నిమ్మగడ్డ తమ మనిషి అని టీడీపీ ఒప్పుకున్నట్లే కదా అన్నారు. ముందు అధికారులను తొలగించాలని ఘీంకరించారు..ఇప్పుడేమో వెనక్కు తీసుకున్నారు ఎన్నికల కమిషన్ తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళుతోందని ధ్వజమెత్తారు. దీనికి ఎన్నికల కమిషన్ మూల్యం చెల్లించక తప్పదని, .పదవీ విరమణ చేసిన తర్వాత అయినా తప్పదు అని అంబటి పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్