బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. అమలులోకి కొత్త నిబంధనలు..?

ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటుంటే మరికొన్ని బ్యాంకులు కస్టమర్లకు భారీ షాకులు ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. డిపాజిట్, క్యాష్ విత్‌ డ్రా ఛార్జీల విషయంలో కీలక మార్పులు చేసింది. నూతన నిబంధనలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్ కస్టమర్లు మూడుసార్లు మాత్రమే ఉచితంగా […]

Written By: Navya, Updated On : November 3, 2020 8:12 pm
Follow us on


ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటుంటే మరికొన్ని బ్యాంకులు కస్టమర్లకు భారీ షాకులు ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. డిపాజిట్, క్యాష్ విత్‌ డ్రా ఛార్జీల విషయంలో కీలక మార్పులు చేసింది. నూతన నిబంధనలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

కస్టమర్లు మూడుసార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. మూడు ఉచిత లావాదేవీలు దాటితే ఖాతాదారులు ఒక్కో లావాదేవీకి 50 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో నగరాలు, పట్టణాలలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతా ఉన్నవాళ్లు ఈ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఈ తరహా నిబంధనలను అమలు చేస్తోంది.

Also Read: పేటీఎం యూజర్లకు శుభవార్త.. ఆ చార్జీల రద్దు..?

చిన్న పట్టణాలు, గ్రామాలలో సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు మూడు ఉచిత లావాదేవీలు పూర్తైతే కనీస మొత్తం 40 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఓడీ, కరెంట్ అకౌంట్ కలిగిన వాళ్లు లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే ఉచిత లావాదేవీలు ముగిసిన తర్వాత ఒక్కో లావాదేవీకి 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేయాలంటే కూడా ఇదే తరహా నిబంధనలు అమలులో ఉన్నాయి.

Also Read: తక్కువ పెట్టుబడితో లాభాలిచ్చే బిజినెస్ ఇదే.. నెలకు లక్షల్లో ఆదాయం..!

జన్ ధన్ అకౌంట్లు మినహా మిగిలిన ఖాతాలకు ఈ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకును బట్టి ఉచిత లావాదేవీల విషయంలో మార్పులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అనే తేడాల్లేకుండా అన్ని బ్యాంకులు ఖాతాదారులపై భారం మోపుతుండటం గమనార్హం.