అఖిల్ ఎలిమినేషన్.. మరోసారి దొరికిన బిగ్ బాస్

తెలుగులో ‘బిగ్ బాస్’ షో నెంబర్ వన్ కొనసాగుతోంది. గత మూడు సీజన్లు బిగ్ బాస్-1..బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే బిగ్ బాస్-4 సీజన్ మాత్రం ఆ హవాను కొనసాగించలేక చతికిలపడుతోంది. వీకెండ్లో మినహా మిగతా రోజుల్లో ఈ షోకు దారుణమైన టీఆర్పీ వస్తుండటంతో నిర్వాహాకులు తలలు పట్టుకుంటున్నారు. Also Read: సమంత సామ్-జామ్..అన్ని కలిపేసి కిచిడిలా మారిందా? బిగ్ బాస్-4 పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకోగా వాటిని […]

Written By: NARESH, Updated On : November 15, 2020 3:08 pm
Follow us on

తెలుగులో ‘బిగ్ బాస్’ షో నెంబర్ వన్ కొనసాగుతోంది. గత మూడు సీజన్లు బిగ్ బాస్-1..బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే బిగ్ బాస్-4 సీజన్ మాత్రం ఆ హవాను కొనసాగించలేక చతికిలపడుతోంది. వీకెండ్లో మినహా మిగతా రోజుల్లో ఈ షోకు దారుణమైన టీఆర్పీ వస్తుండటంతో నిర్వాహాకులు తలలు పట్టుకుంటున్నారు.

Also Read: సమంత సామ్-జామ్..అన్ని కలిపేసి కిచిడిలా మారిందా?

బిగ్ బాస్-4 పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకోగా వాటిని తొలినాళ్లలో నిర్వాహాకులు ఒమ్ము చేశారు. ఈ షోలో సెలబ్రెటీలు పెద్దగా లేకపోవడంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ క్రమంగా అలరించే టాస్కులు పెడుతుండటంతో మెల్లిమెల్లిగా ప్రేక్షకులు బిగ్ బాస్-4కు అలవాటు పడిపోయాయి. అయితే అనుకున్నంత మాత్రం టీఆర్పీ రావడం లేదని తెలుస్తోంది.

ఈనేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహాకులు టీఆర్పీ కోసం రియల్టీ షోను కాస్తా డ్రామా షోగా మార్చేస్తుంది. దీంతో బిగ్ బాస్ తన అస్థిత్వాన్ని కోల్పోతున్నాడనే టాక్ విన్పిస్తోంది. ఇలా చేయడం వల్ల అసలుకే మోసం వస్తుందని బిగ్ బాస్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల షోలో జరిగిన కొన్ని ఎపిసోడ్ చూస్తే ఇది రియల్టీ షోనా? లేదా డ్రామా షోనా అనే ప్రశ్నలు తలెత్తాయి.

Also Read: బిగ్ బాస్-4.. ఎలిమినేషన్ లీక్.. ఈసారి మోహబూబ్ ఔట్

బిగ్ బాస్ నుంచి  తాజాగా అఖిల్ ఎలిమినేషన్ అయినట్లు ప్రోమోల్లో చూపించారు. గతంలోనూ సుమ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందని చూపించి చివరికీ కామెడీని చేశారు. దీంతో అఖిల్ ఎలిమినేషన్ పై కూడా ప్రేక్షకులు ఫేక్ అనే అభిప్రాయపడగా అందుకు తగ్గట్టుగానే అఖిల్ సేఫ్ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

బిగ్ బాస్ షో ను నిర్వాహకులు నడుపుతున్న తీరుపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ లో డ్రామా ఆడేవారికే ప్రాధాన్యమిస్తూ రియల్ గేమ్ ఆడేవారిని బయటికి పంపుతున్నారనే టాక్ నడుస్తోంది. షో నిర్వాహకులు సైతం రియల్టీకి కాకుండా డ్రామాకే ప్రాధాన్యం ఇస్తుండటంపై అభిమానులు మండిపడుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్-4 ప్రేక్షకులకు ఏమాత్రం మజాను ఇవ్వలేకపోతుందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.