జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గ్రేటర్ ఎన్నికల మెనిఫెస్టోను బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మెనిఫెస్టోను తయారుచేశామన్నారు. ఇక్కడి ప్రజలకు ఏం కావాలో బిజేపీకి తెలుసన్నారు.
1. పాతబస్తీ డివిడజన్ అభివ్రుద్ధికి రూ. 4 కోట్లకు తగ్గకుండా నిధులు
2. వీధి వ్యాపారులకు ఆరోగ్య బీమా
3. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7 వేల ఆర్థిక సాయం, ప్రమాద బీమా
4. హైదరాబాద్ లో గుంత కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు
5. నాళాలు, డ్రైనేజీల ఆధునికీకరణ కోసం రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక నిధి.
6. జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు
7. జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత
8. 125 గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు.
9. విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు, వై-ఫై సౌకర్యం
10. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు
సామాన్యుడి ఆకాంక్షల మేరకే బిజెపి మేనిఫెస్టో
బిజెపి గ్రేటర్ మేనిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis#BJPManifesto
— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020