Ayyappam Koshiyum Remake: మలయాళంలో సంచలన విజయం అందుకున్న ‘అయ్యప్పనుమ్ కొశియమ్’ మూవీ రీమేక్ ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాన్, హీరో రానాలు కలిసి తీస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా దీనికి ‘బీమ్లా నాయక్’ అనే పేరును పెట్టి టీజర్ ను విడుదల చేశారు. దీనికి విపరీతమైన స్పందన వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
ఇక ఈ గ్రాండ్ హిట్ అయిన మూవీని హిందీలోనూ రిమేక్ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా నుంచి అనుకోకుండా ఒక హీరో తప్పుకున్నట్టు తెలుస్తోంది.
అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), జాన్ అబ్రహం (John Abraham) హీరోలుగా జగన్ శక్తి దర్శకత్వంలో ఈ మూవీని కొద్దిరోజుల కిందటే అనౌన్స్ చేశాడు. ఇటీవల ఈ ఇద్దరు స్టార్ హీరోలతో చర్చలు జరిపిన అనంతరమే ఈ స్క్రిప్ట్ ను మార్చారు. నవంబర్ లో దీనిని పట్టాలెక్కించేలా ప్లాన్ చేశారట..
అయితే సడెన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం సంచలనమైంది. ఒక్కసారిగా ఈ సినిమా న్యూస్ పై రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఇందులో ఏది నిజం అన్నది తెలియరాలేదు.
హీరోకు, దర్శకుడికి క్లాష్ అవ్వడం వల్లే అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ వరుసగా మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒత్త సెరుప్పు సైజు7 అనే రిమేక్ తోపాటు బాబ్ విశ్వాస్, దస్వి సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాయపడ్డారని తెలిసింది. ప్రస్తుతం అభిషేక్ రెస్ట్ తీసుకుంటున్నారని.. పాత సినిమాలు పూర్తి చేయనిదే ‘అయ్యప్పమ్ కోశియమ్’ రేసే అవకాశం లేదని ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం అభిషేక్ స్థానంలో మరో నటుడి కోసం టీం అన్వేషిస్తున్నట్టు తెలిసింది.