బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేస్తున్నారా.. ఈ తప్పు చేస్తే డబ్బులు మాయం..?

దేశంలో బ్యాంక్ ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేసుకోని వాళ్లను టార్గెట్ చేసి కొత్త రకం మోసాలకు తెర లేపుతున్నారు. 2021 మార్చి 31 లోపు బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ చేయాలనే ఆదేశాల నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేసి […]

Written By: Navya, Updated On : November 17, 2020 9:04 am
Follow us on


దేశంలో బ్యాంక్ ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేసుకోని వాళ్లను టార్గెట్ చేసి కొత్త రకం మోసాలకు తెర లేపుతున్నారు. 2021 మార్చి 31 లోపు బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ చేయాలనే ఆదేశాల నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేసి కొత్త రకం మోసాలకు తెర లేపారు.

సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం లేదా ఆన్ లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ కార్డును లింక్ చేసుకోని వాళ్లకు అకౌంట్ లింక్ చేసుకునేంత వరకు తాత్కాలికంగా సేవలు నిలిపివేయబడతాయి. దీంతో మోసగాళ్లు బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు కాల్ చేసి ఖాతాల వివరాలు తెలుసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు.

గత కొన్ని రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డును లింక్ చేసుకోకపోతే బ్యాంకు సేవలను పొందలేరని.. బ్యాంక్ వివరాలు, వన్ టైమ్ పాస్ వర్డ్ చెబితే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డును లింక్ చేస్తామని చెప్పి ఖాతాల్లోని నగదును మాయం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైనా అలా కాల్ చేస్తే వాళ్లు మోసగాళ్లని గ్రహించాలి.

బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలు ఎప్పుడైనా ఫోన్ ద్వారా జరపకూడదని గుర్తుంచుకోవాలి. మోసపూరిత కాల్స్ ను నమ్మితే తరువాత బాధ పడాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని భావిస్తే బ్యాంక్ కు వెళ్లి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుని బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ ను లింక్ చేయించుకుంటే మంచిది.