https://oktelugu.com/

బీజేపీతో పొత్తుపై స్పందించిన పవన్..

ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు 20 నెలల తరువాత జరగబోయే తిరుపతి లోక్ సభ ఎన్నికలకు వివిధ పార్టీల నాయకులు సన్న్ధద్ధం అవుతున్నారు. ఇప్పటికే.. తెలుగుదేశం పార్టీ ధర్మపరిరక్షణ యాత్ర పేరిట దాదాపు ఎన్నికల ప్రచారం ప్రారంభించగా.. బీజేపీ.. జనసేనలు కూడా ఆ దిశగా.. అడుగులు వేస్తున్నారు. శుక్రవారం తిరుపతి వెంకన్నను దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. అయితే తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి భరిలో ఉంటారా? […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 23, 2021 1:15 pm
    Follow us on

    Pawan Kalyan
    ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు 20 నెలల తరువాత జరగబోయే తిరుపతి లోక్ సభ ఎన్నికలకు వివిధ పార్టీల నాయకులు సన్న్ధద్ధం అవుతున్నారు. ఇప్పటికే.. తెలుగుదేశం పార్టీ ధర్మపరిరక్షణ యాత్ర పేరిట దాదాపు ఎన్నికల ప్రచారం ప్రారంభించగా.. బీజేపీ.. జనసేనలు కూడా ఆ దిశగా.. అడుగులు వేస్తున్నారు. శుక్రవారం తిరుపతి వెంకన్నను దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. అయితే తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి భరిలో ఉంటారా? లేక జనసేన నుంచి అభ్యర్థిని భరిలో దింపుతారా అనే దానిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని భావించారు. పార్లమెంటు పరిధిలోనే నేతలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న జనసేన అధినేత వాటిపై రాజకీయ వ్యవహారాల కమిటీతో సైతం కులంకశంగా చర్చించారు.

    Also Read: అమ్మ ఒడిని మించిన పథకం తెస్తున్న సీఎం జగన్

    అయితే ఆ సమావేశంలో… అందుబాటులో ఉన్న అభ్యర్థి విషయమై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. అయితే శ్రేణుల నుంచి కూడా తమ పార్టీ అభ్యర్థే.. బరిలో నిలవాలని కార్యకర్తలు అంటున్నారు. కాకపోతే పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో కార్యకర్తలు సందిగ్దంలో ఉండిపోయారు. బీజేపీ కేంద్ర, రాష్ట్ర అధినాయకత్వంతో మరోమారు చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని, వారం రోజుల్లో విషయం వెల్లడిస్తామని జన నేతలు చెప్పినట్లు సమాచారం.

    Also Read: ప్రశ్నిస్తే చంపేస్తారా? నిన్ను తొక్కేస్తా వైసీపీ ఎమ్మెల్యే.. జనసైనికుడి కుటుంబానికి పవన్ పరామర్శ

    ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పొ్త్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ, జనసేన అదే రీతిలో తిరుపతిలోనూ పోటీ చేయాల్సి ఉంటుందని, అప్పుడే తమ కూటమికి విలువ ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. పవన్ తీరును పరిశీలిస్తే.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి బీజేపీ కూటమి నుంచే అభ్యర్థి భరిలో ఉంటారని శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అభ్యర్థి అయితే పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తామని.. బీజేపీ నుంచి నిలబెడితే.. జన సైనికులు ప్రచారానికి ముందుకు రారనే తీరు వ్యక్తం అవుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్