ఆ బృహత్తర కార్యక్రమానికి ఏడాది..

రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక.. పలు సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే చేరుతున్నాయి. ఇంటి వద్ద కూర్చున్న వారి చెంతకే అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. పలు పథకాలు ప్రవేశ పెట్టి.. ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ప్రతీ గ్రామంలో సచివాలయ వలంటీర్లను నియమించి.. ప్రజల బాగోగులు చూసుకోవాలని సూచించారు. ఏ పని చేసుకోని […]

Written By: NARESH, Updated On : February 1, 2021 11:46 am
Follow us on

రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక.. పలు సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే చేరుతున్నాయి. ఇంటి వద్ద కూర్చున్న వారి చెంతకే అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. పలు పథకాలు ప్రవేశ పెట్టి.. ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ప్రతీ గ్రామంలో సచివాలయ వలంటీర్లను నియమించి.. ప్రజల బాగోగులు చూసుకోవాలని సూచించారు. ఏ పని చేసుకోని వృద్ధులకు పెద్ద కొడుకుగా మారి ప్రతినెలా ఠంఛన్ గా పింఛన్లు అందిస్తున్నారు జగన్. ఏపీలో ఇంటింటికీ పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తవుతోంది. దీంతో వృద్ధులు ఈ పథకంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ నెల 1వ తేదీనే ఎదురుచూడకుండా డబ్బులు అందుతున్నాయని.. సీఎం జగన్ తమకు పెద్ద కొడుకులా నిలిచారని.. అతడి రుణం తీర్చుకోలేమని ఏపీలోని పింఛన్ లబ్ధిదారులు అంటున్నారు.

ఏపీలో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేసే సరికొత్త పరిపాలన సంస్కరణలకు నాంది పలికి ఏడాది అవుతోంది. గతంలో విధంగా అవ్వా.. తాతలు.. పింఛన్ డబ్బులు తీసుకోవడానికి ప్రతీ నెలా.. నడవలేని స్థితిలోనూ.. కాళ్లు ఈడ్చుకుంటూ.. పంచాయతీ ఆఫీసుల వద్దకు వెళ్లి.. అక్కడ గంటల తరబడి పడిగాపులు పడే పరిస్థితి.. ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. మారుమూల కుగ్రామంతో సహా అన్ని ప్రాంతాల్లోనూ ప్రతీనెలా ఒకటో తేదీనాటికి ఉదయాన్నే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ డబ్బలు పంపిణీ చేసే కార్యక్రమం గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది.

గత ఏడాది కాలంగా లబ్ధిదారులకు ఏ చిన్న ఇబ్బంది కూడా ఏర్పడకుండా పింఛన్ల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 61.50 లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా ఒకటవ తేదీనే 95శాతం మందికి పై లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు చేరుతున్నాయి. లబ్ధిదారులు ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా.. వారున్న చోటుకే వెళ్లి వలంటీర్లు డబ్బులు పంపిణీ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి.

ఈనెల కూడా పింఛన్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ సోమవారం 61.54 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శనివారమే నిధులు విడుదల చేసింది. ఆ మేరకు.. నగదును గ్రామ సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ప్రతినెలా జరిగే మాదిరిగానే సోమవారం వేకువజామున నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.