https://oktelugu.com/

ఒగ్గేసిపోకే అమృత.. అంటూ విరహాగీతం పాడుతున్న మెగాహీరో..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బర్త్ డే నేడు(అక్టోబర్ 15). టాలీవుడ్లో సాయిధరమ్ తేజ్ సుప్రీమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస విజయాలతో మెగా హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. యూత్ ను ఆకట్టుకునే కథాంశంతో ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Also Read: కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్..! ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 12:04 PM IST
    Follow us on

    మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బర్త్ డే నేడు(అక్టోబర్ 15). టాలీవుడ్లో సాయిధరమ్ తేజ్ సుప్రీమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస విజయాలతో మెగా హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. యూత్ ను ఆకట్టుకునే కథాంశంతో ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    Also Read: కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్..!

    ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తుండగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్టు లుక్.. రెండు వీడియో సాంగ్స్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

    నేడు సాయిధరమ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ తేజుకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. ‘ఒగ్గేసిపోకే అమృత’ అంటూ సాగే విరహగీతాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీటర్లో విడుదల చేసి తేజుకు బర్త్ డే విషెస్ చెప్పాడు. ‘బల్బు కనిపెట్టినోడికే బ్రతుకు సిమ్మ చీకటైపోయిందే.. సెల్లు ఫోను కంపెనోడికే సిమ్ కార్డే బ్లాకై పోయిందే.. రూటు చూపే గూగులమ్మనే ఇంటి రూటునే మరచిపోయిందే.. రైటు టైము చెప్పే వాచ్ కె బ్యాడ్ టైమే స్టార్టైపోయిందే..’ అంటూ పాట కొనసాగింది.

    Also Read: ఒగ్గేసిపోకే అమృత.. అంటూ విరహాగీతం పాడుతున్న మెగాహీరో..!

    ‘అగ్గిపుల్లనే నేను మెల్లగా కాల్చుతుంటే.. సొంత కొంపనే ఫుల్లుగా పెట్టుకున్నాదే.. పాస్ట్ లైఫ్ లో నేను చెప్పిన ఎదవ మాటే బ్రైట్ ఫ్యూచరే నీలా తగలబెట్టిందే.. ఒగ్గేసిపోకే అమృతా నేను తట్టుకోలేక మందు తాగుతా.. ఒట్టేసి చెప్తున్నా అమృతా నువ్వెళ్ళిపోతే ఒంటరిపోతా..’ అంటూ అమృత తన జీవితంలో నుంచి వెళ్లిపోయిన సందర్భంలో హీరో విరహగీతం పాడుకుంటూ కన్పించాడు. ఈ పాటకు తమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.