https://oktelugu.com/

కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్..!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో స్టూడెంట్ నెంబర్.. ఆది.. సింహాద్రి.. యమదొంగ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ప్లాపులు రావడంతో సైలెంటయ్యాడు. అయితే పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ మూవీ తర్వాత ఎన్టీఆర్  వరుస విజయాలతో తన దూకుడును చూపిస్తున్నాడు. Also Read: ఒగ్గేసిపోకే అమృత.. అంటూ విరహాగీతం పాడుతున్న మెగాహీరో..! ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’.. ‘జనతా గ్యారేజ్’.. ‘జై […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 12:07 PM IST
    Follow us on

    టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో స్టూడెంట్ నెంబర్.. ఆది.. సింహాద్రి.. యమదొంగ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ప్లాపులు రావడంతో సైలెంటయ్యాడు. అయితే పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ మూవీ తర్వాత ఎన్టీఆర్  వరుస విజయాలతో తన దూకుడును చూపిస్తున్నాడు.

    Also Read: ఒగ్గేసిపోకే అమృత.. అంటూ విరహాగీతం పాడుతున్న మెగాహీరో..!

    ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’.. ‘జనతా గ్యారేజ్’.. ‘జై లవ కుశ’.. ‘అరవింద సమేత.. వీరరాఘవ’ సినిమాలన్నీ సూపర్ హిట్టుగా నిలిచాయి. వరుసగా ఐదు విజయాలను అందుకున్న హీరోగా ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ డ్యాన్సర్ గా.. సింగర్ గా.. నటుడిగా తనలోని అన్ని వేరియేషన్స్ చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

    ఎన్టీఆర్ కు తెలుగుతోపాటు సౌత్, విదేశాల్లో మంచి మార్కెట్ ఉంది. తాజాగా కోలీవుడ్లో ఎన్టీఆర్ పేరు మార్మోగడం ఆసక్తిని రేపుతోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్..  అజిత్ తర్వాత నందమూరి హీరోనే అన్నట్లుగా ప్రచారం జరుగుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఇందుకు ప్రధాన కారణంగా దర్శకుడు శివ అని తెలుస్తోంది. తెలుగులో శౌర్యం మూవీతో పరిచయమైన దర్శకుడు శివ టాలీవుడ్లో మాత్రం పెద్దగా రాణించలేదు.

    తమిళంలో మాత్రం ‘సిరుత్తై’.. ‘వీరం’.. ‘వేదాళం’.. వంటి సూపర్ హిట్ చిత్రాలను  దర్శకుడు శివ తెరకెక్కించాడు. తాజాగా ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు శివ సన్నహాలు చేస్తున్నాడు. శివ ప్రస్తుతం రజినీకాంత్‌తో ‘అన్నాత్తె’ తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట.

    Also Read: ఓటీటీ వర్సెస్ మల్టీప్లెక్స్.. నిర్మాతలకు షాక్..!

    కోలీవుడ్ హీరోలంతా శివతో సినిమా చేయాలని చూస్తుంటే శివ మాత్రం ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో కొమురంభీంగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి ‘అయినను హస్తినకు పోయిరావలే’ అని మూవీలో నటించనున్నాడు. తాజాగా దర్శకుడు శివతో ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తాడనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.