
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు 18వ శతాబ్దంలో నిర్మితమైన కోట కూలింది. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామంలో ఉన్న పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న కట్టిన కోట కూలడంతో ఆ కోట కింద ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ కోటను తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం పర్యాటక ప్రాంతంగా గుర్తించి రూ. 4కోట్ల 50 లక్షలు మంజూరు చేసింది. అయితే ఇక్కడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు.