https://oktelugu.com/

50వేల ఉద్యోగాలు.. అనేక చిక్కు ప్రశ్నలు..!

త్వరలో నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోపు ప్రభుత్వం 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని వేగంగా కసరత్తులు చేస్తోంది. Also Read: రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ నిలిపివేసిన ప్రభుత్వం.. ఎందుకు? దీనిలో భాగంగానే సీఎం కేసీఆరే స్వయంగా 50వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం హడావుడిగా నోటిఫికేషన్లు వస్తే మాత్రం తర్వాత ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 50వేల ఉద్యోగాల భర్తీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 19, 2020 7:32 pm
    Follow us on

    Private jobs in telangana

    త్వరలో నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోపు ప్రభుత్వం 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని వేగంగా కసరత్తులు చేస్తోంది.

    Also Read: రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ నిలిపివేసిన ప్రభుత్వం.. ఎందుకు?

    దీనిలో భాగంగానే సీఎం కేసీఆరే స్వయంగా 50వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం హడావుడిగా నోటిఫికేషన్లు వస్తే మాత్రం తర్వాత ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    50వేల ఉద్యోగాల భర్తీ పాత జోనల్ వ్యవస్థలో భర్తీ చేస్తారా? లేదా కొత్త జోనల్ వ్యవస్థ భర్తీ చేస్తారా? అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై తేల్చకుండా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలున్నాయి.

    పాత జోనల్ వ్యవస్థ ప్రకారంగా పది పూర్వ జిల్లాల ప్రాతిపదికన ఆయా పోస్టులకు స్థానిక రిజర్వేషన్ ఉంటుంది. ఇక కొత్త జోనల్ వ్యవస్థలో 31జిల్లాలు ఉన్నందున స్థానిక రిజర్వేషన్ 95% ఉంటుంది. దీంతో ఏ ప్రతిపాదికన నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత మరో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో 33 జిల్లాలు అయినందునా మిగతా రెండు జిల్లాలు ఏ జోన్‌ల్లోకి వెళ్తాయనే తేలాల్సి ఉంది.

    Also Read: ఉద్యోగాల భర్తీలో స్పీడు పెంచిన తెలంగాణసర్కార్.. ఖాళీలు ఎన్నంటే?

    50వేల ఉద్యోగాల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలంటే టెట్ తప్పనిసరి అని తెలుస్తోంది. దీంతో నోటిఫికేషన్లకు ముందే ప్రభుత్వం టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

    ఇప్పటికే ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆగ్రహం ఉన్నందున ప్రభుత్వం సైతం నోటిఫికేషన్లకు ముందే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు.. అడ్డంకులు రాకుండా కసరత్తులు చేస్తుందని సమాచారం.

    కొన్నాళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగుల్లో నిరుత్సాహం అవరించి ఉంది. ప్రభుత్వం 50వేల ఉద్యోగాల భర్తీ ప్రకటించినా నిరుద్యోగుల నుంచి మిశ్రమ స్పందనే వచ్చింది.

    ఉద్యోగాల విషయంలో చాలాసార్లు తాము ప్రభుత్వం చేతిలో మోసపోయామనే నైరాశ్యం వారిలో కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఈసారైనా ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలు తీర్చేలా నోటిఫికేషన్లు వస్తాయో లేదో వేచిచూడాల్సిందే..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్