చలికాలంలో బెల్లం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

దేశంలో చాలామంది ఆహార పదార్థాల తయారీలో బెల్లం కంటే చక్కెరను ఎక్కువగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చక్కెరతో పోలిస్తే బెల్లం వల్లే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. చెరుకు రసం నుంచి తయారు చేసే బెల్లం కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. ఆయుర్వేదంలో కొన్ని ఔషధాల తయారీ కోసం బెల్లం వినియోగిస్తారంటే బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు సులువుగా అర్థమవుతాయి. Also Read: పేపర్ కప్పులలో టీ తాగే వారికి […]

Written By: Navya, Updated On : November 10, 2020 12:29 pm
Follow us on


దేశంలో చాలామంది ఆహార పదార్థాల తయారీలో బెల్లం కంటే చక్కెరను ఎక్కువగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చక్కెరతో పోలిస్తే బెల్లం వల్లే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. చెరుకు రసం నుంచి తయారు చేసే బెల్లం కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. ఆయుర్వేదంలో కొన్ని ఔషధాల తయారీ కోసం బెల్లం వినియోగిస్తారంటే బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు సులువుగా అర్థమవుతాయి.

Also Read: పేపర్ కప్పులలో టీ తాగే వారికి షాకింగ్ న్యూస్..?

బెల్లంలో క్యాలరీలు సైతం తక్కువగానే ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతామని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే బెల్లం ద్వారా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలో బెల్లంను డైట్ లో భాగంగా చేర్చుకోవడం వల్ల ఐదురకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుంది.

బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని శ్వాసకోశ, జీర్ణవ్యవస్థలను శుభ్రపరుస్తాయి. అందువల్ల రోజులో ఒక్కసారైనా బెల్లాన్ని తీసుకుంటే మంచిది. బెల్లం మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను సులువుగా దూరం చేస్తుంది. ఆస్తమాతో బాధ పడే వాళ్లు బెల్లం తీసుకుంటే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. రక్తహీనత సమస్య నివారణలో బెల్లం అద్భుతంగా పని చేస్తుంది.

Also Read: పెళ్లి కాని మగాళ్లకు షాకింగ్ న్యూస్.. కరోనా రిస్క్ ఎక్కువట..?

సాధారణంగా చలికాలంలో ఫ్లూ, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బెల్లం తీసుకునే వాళ్లలో ఫ్లూ, ఇతర సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు. బెల్లం షర్భత్ ను తీసుకుంటే పొట్ట చల్లగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం కాలేయ సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.