https://oktelugu.com/

భారత జవాన్ల చేతిలో చచ్చిన చైనా జవాన్ల సంఖ్య 45

తూర్పు లఢక్ లో గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ భారత్ జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం యావత్తు దీనిపై సైనికులకు అండగా నిలిచింది. చైనా సైనికులతో ఘర్షణలో 20 సైనికులు అమరులైనట్లు భారత ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. కానీ ఆ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మరణించారన్న విషయాన్ని అక్కడి చైనా ప్రభుత్వం మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికీ ఎంత మంది చైనా సైనికులు చనిపోయారన్నది సస్పెన్స్ గానే ఉంది. తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2021 / 07:27 PM IST
    Follow us on

    తూర్పు లఢక్ లో గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ భారత్ జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం యావత్తు దీనిపై సైనికులకు అండగా నిలిచింది. చైనా సైనికులతో ఘర్షణలో 20 సైనికులు అమరులైనట్లు భారత ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది.

    కానీ ఆ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మరణించారన్న విషయాన్ని అక్కడి చైనా ప్రభుత్వం మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికీ ఎంత మంది చైనా సైనికులు చనిపోయారన్నది సస్పెన్స్ గానే ఉంది.

    తాజాగా ఈ విషయాన్ని రష్యా అధికార మీడియా ఏజెన్సీ బయటపెట్టి సంచలన నిజాలు వెల్లడించింది. భారత్-చైనా దేశాల సరిహద్దుల మధ్య తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించుతూ ఇరుదేశాల బలగాలను ఉపసంహరించే ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా మీడియా సంస్థ ఈ నిజాలను బయటపెట్టింది.

    గల్వాన్ లో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. 20 మంది భారత సైనికులు మరణించినట్లు పేర్కొంది. వీటిపై అమెరికాతోపాటు అప్పట్లో వచ్చిన కొన్ని ఇంటెలిజెన్స్ నివేదికలను రష్యా సంస్థ చూపించింది.