తక్కువ పెట్టుబడితో డబ్బులు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

దేశంలో చాలా నెలల క్రితం జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం అమలు వల్ల దేశంలో జీఎస్టీ సలహాదారులకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే చాలామంది వ్యాపారాలు చేస్తున్నా జీఎస్టీ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్లు అకౌంటింగ్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల సహాయంతో జీఎస్టీ దాఖలు చేయడం లేదా జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్‌కు వెళ్లడం చేస్తున్నారు. Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. తక్కువ ప్రీమియంతో […]

Written By: Navya, Updated On : February 12, 2021 5:41 pm
Follow us on

దేశంలో చాలా నెలల క్రితం జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం అమలు వల్ల దేశంలో జీఎస్టీ సలహాదారులకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే చాలామంది వ్యాపారాలు చేస్తున్నా జీఎస్టీ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్లు అకౌంటింగ్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల సహాయంతో జీఎస్టీ దాఖలు చేయడం లేదా జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్‌కు వెళ్లడం చేస్తున్నారు.

Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే ఛాన్స్..?

అయితే జీఎస్టీ సువిధ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల సందేహాలను సులభంగా నివృత్తి చేయడంతో పాటు ఉపాధిని పొందవచ్చు. ఈ కేంద్రం ద్వారా ప్రతి సేవకు నిర్ణీత రుసుమును తీసుకుని సులభంగా జీఎస్టీని దాఖలు చేయడంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా సులభంగా పొందే అవకాశం ఉంటుంది. జీఎస్టీ సువిధ కేంద్రం ద్వారా కేంద్రం నిర్వాహకులతో పాటు కస్టమర్లకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.

Also Read: ఈ పాస్‌వర్డ్‌ లు వాడుతున్నారా.. ప్రమాదంలో పడినట్లే..?

జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్‌ ద్వారా అనేక ప్రభుత్వ రకాల సేవలను అందించవచ్చు. సిఎ సర్టిఫికేషన్, ఆదాయపు పన్ను రిటర్న్ తో పాటు ఉద్యోగ ఆధార్, జిఎస్టి రిటర్న్ ఫైలింగ్, డిఎస్సి, అకౌంటింగ్ సేవలను సులభంగా అందించవచ్చు. రైలు, విమాన టికెట్ల బుకింగ్, ఇతర ఆన్‌లైన్ సేవలు, ఆధార్ మనీ ట్రాన్స్ఫర్ లాంటి సర్వీసులను అందించవచ్చు. ఇంటర్ పాసై జీఎస్టీ, అకౌంటింగ్ పై అవగాహన ఉండి కంప్యూటర్, ఇంటర్నెట్ గురించి ప్రాథమిక విషయాలు తెలిసి ఉంటే సులభంగా జీఎస్టీ సువిధ కేంద్రం ఏర్పాటు చేయవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

100 – 150 చదరపు మీటర్ల స్థలం, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్‌లు, స్కానర్‌లు, మోర్ఫో పరికరాలు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే జీఎస్టీ సువిధ కేంద్రం ఏర్పాటు చేయవచ్చు. . సిఎస్‌సి, వక్రంజీ, వికె వెంచర్, వాన్విక్ టెక్ సొల్యూషన్ వంటి సంస్థల ద్వారా ఫ్రాంఛైజీని తీసుకోవచ్చు. 70 వేల రూపాయలు ఖర్చు చేసి సులభంగా జీఎస్టీ సువిధ కేంద్రం ఏర్పాటు చేయవచ్చు.