నితిన్ ‘చెక్’ బేరం అదుర్స్.. విడుదలకు ముందే లాభాలు

నితిన్-చంద్రశేఖర్ యేలేటీ కాంబినేషన్ లో భవ్య సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘చెక్’. చందరంగం నేపథ్యంలో టెర్రరిస్ట్ గా ముద్రపడిన ఓ యువకుడి కథతో ఆద్యంతం ఉత్కంఠగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు ‘చంద్రశేఖర్ యేలేటి’. ఆయన చిత్రాలన్నీ ఒక కొత్త అంశంపై పరిశోధన చేసినట్టు.. ఒక కొత్త అంశాన్ని కనుగొన్నట్టు అద్భుంగా ఉంటాయి. గత చిత్రాలన్నీ కూడా కొత్తదనం ఉన్నా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేకపోయాయి. అయినా ఆయన ప్రయోగాలు మాత్రం […]

Written By: NARESH, Updated On : February 11, 2021 8:00 pm
Follow us on

నితిన్-చంద్రశేఖర్ యేలేటీ కాంబినేషన్ లో భవ్య సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘చెక్’. చందరంగం నేపథ్యంలో టెర్రరిస్ట్ గా ముద్రపడిన ఓ యువకుడి కథతో ఆద్యంతం ఉత్కంఠగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు ‘చంద్రశేఖర్ యేలేటి’. ఆయన చిత్రాలన్నీ ఒక కొత్త అంశంపై పరిశోధన చేసినట్టు.. ఒక కొత్త అంశాన్ని కనుగొన్నట్టు అద్భుంగా ఉంటాయి. గత చిత్రాలన్నీ కూడా కొత్తదనం ఉన్నా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేకపోయాయి. అయినా ఆయన ప్రయోగాలు మాత్రం మారకుండా కొత్త దనం కోసం ట్రై చేస్తూనే ఉంటాడు.

చందరంగం ఆట నేపథ్యంలో ఓ టెర్రరిస్ట్ అయిన నితిన్ ఎలా ఉరిశిక్ష నుంచి బతికి బయటపడ్డాడన్నది అసలు కథ.ప్రియా ప్రకాష్ , రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. పోసాని, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తిని రెట్టింపు చేసింది.

కాగా ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను రూ.5.40 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక ఆంధ్రా ఏరియాకు 7 కోట్ల రేషియోలో క్లోజ్ చేసినట్టు సమాచారం. సీడెడ్ హక్కులను కేఎఫ్సీ సంస్థ తీసుకున్నట్టు సమాచారం.

ఇప్పటికే డిజిటల్ శాటిలైట్ రైట్స్ ను జెమినీటీవీకి విక్రయించడంతో కోట్లు వచ్చాయి. హిందీ డబ్బింగ్ కూడా భారీగానే రేటు పలుకుతోందట..

మొత్తంగా సినిమా ఖర్చు కంటే కూడా లాభాలు ఎక్కువగానే వచ్చినట్టు సినిమా బిజినెస్ ను బట్టి తెలుస్తోంది.