ఏపీలో ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభమైంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రైతుల ఖాతాల్లోకి బీమా సొమ్మును జమచేసే కారక్రమాన్ని ప్రారంభించారు. 2019 సీజన్ లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు రూ. 1,252 కోట్ల బీమా పరిహారాన్ని పంపిణీ చేశారు. రాష్ట్రంలో కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని, ఇక నుంచి పంట నష్టం జరిగితే రైతులు […]

Written By: Suresh, Updated On : December 15, 2020 1:06 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభమైంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రైతుల ఖాతాల్లోకి బీమా సొమ్మును జమచేసే కారక్రమాన్ని ప్రారంభించారు. 2019 సీజన్ లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు రూ. 1,252 కోట్ల బీమా పరిహారాన్ని పంపిణీ చేశారు. రాష్ట్రంలో కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని, ఇక నుంచి పంట నష్టం జరిగితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలున్నాయని, వాటన్నింటిని గ్రామ సచివాలయాలతో అనుసంధానించామన్నారు. గతంలో 20 లక్షల మంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉండేదని ఇఫ్పుడు 57 లక్షల మంది రైతు కుటుంబాలు పంట బీమా పథకం కిందికి వచ్చాయన్నారు.