హోమ్లీ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా వస్తోన్న సినిమా ‘మిస్ ఇండియా’. ఇప్పటికే ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. గత నెలలోనే మేకర్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి బేరం పెట్టారు. ఇక అప్పటినుండే త్వరలోనే ఈ సినిమా ఓటిటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుండి ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ రాకపోయేసరికి ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్స్ లోనే తమ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆ రకంగా ఈ సినిమా ఇప్పటివరకూ ఓటీటీ రేసులో లేకుండా పోయింది.
Also Read: సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్ !
అయితే అనూహ్యంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ తెలుగు సినిమాలను భారీ మొత్తానికి కొనడం స్టార్ట్ చేస్తుండేసరికి.. మిస్ ఇండియా మేకర్స్ కు మళ్లీ ఆశ పుట్టింది. ఎలాగూ ఇప్పట్లో థియేటర్లు తెరిచే అవకాశం లేదు. తెరిచినా జనం ఈ సినిమాకి వస్తారనే గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాని ముందే అమ్మేసుకోవడం ఉత్తమం అనుకున్న సినిమా టీం.. ఆ రకంగా ప్రయత్నాలు చేసి.. మొత్తానికి అనుకున్నది సాధించారు, మిస్ ఇండియాని భారీ ధరకు అమ్మేశారు. దాదాపు 38 కోట్లుకు ఈ సినిమాని అమ్మినట్లు తెలుస్తోంది. ఎలాగూ టీవీ శాటిలైట్ రైట్స్ చేతిలో ఉన్నాయి.. దాని ద్వారా మరో ఎనిమిది నుండి పది కోట్లు వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ లో రిలీజ్ అయ్యే ఆవకాశం ఉంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని అమెజాన్ బృందం ప్లాన్ చేస్తున్నారట. దసరాకి మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమా అయితే బాగా వర్కౌట్ అవుతుందనేది వారి లెక్కలు కావొచ్చు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు. మహేష్ కోనేరు గతంలో ఫిల్మ్ క్రిటిక్ గా పనిచేశారు. అతను మంచి క్రిటిక్ కూడా. ఆ రకంగా చూసుకుంటే.. ఈ మిస్ ఇండియా కథలో ఏదో ప్రత్యేకత ఉంటేనే సినిమా ఓకే చేస్తాడు. కాబట్టి ఈ సినిమాకి మినిమమ్ గ్యారెంటీ ఉంటుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట.
Also Read: బాలయ్యతో నటిస్తా కానీ.. హీరోయిన్ డిమాండ్ !
కాగా ఈ సినిమా కథ.. మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా జరిగే దాడుల గురించి ఉంటాయని.. అలాంటి దాడులని.. అలాగే అలాంటివి జరిగినప్పుడు ఎలా ఎదురుకోవాలనే అంశాన్ని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపిస్తున్నారట. ఇప్పటికే మహానటితో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న కీర్తి సురేష్.. ఈ సినిమాతో కూడా మరోసారి ఆకట్టుకోవడం గ్యారంటీ అంటున్నారు మేకర్స్.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Miss india movie digital rights sold for whopping price
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com