Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఎందుకో సంక్రాంతి పండుగ మొదటి నుండి పెద్దగా కలిసి రాలేదు. అప్పట్లో ఆయన ‘నాయక్’ , ‘ఎవడు’ వంటి హిట్లు కొట్టాడు కానీ, అవి కేవలం మామూలు హిట్స్ మాత్రమే. ఆ తర్వాత సంక్రాంతికి వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. అలాగే రీసెంట్ గా విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ‘వినయ విధేయ రామ’ చిత్రం అప్పట్లో డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కమర్షియల్ గా 70 శాతం కి పైగా రికవరీ ని సాధించింది. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రం కనీసం 50 శాతం రికవరీ కూడా చేయలేకపోయింది. ‘గేమ్ చేంజర్’ వినయ విధేయ రామ రేంజ్ లో సంక్రాంతి సెలవుల్లో ఆడి ఉండుంటే 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి ఉండేది.
కంటెంట్ పరంగా చూస్తే ‘గేమ్ చేంజర్’ చిత్రమే ‘వినయ విధేయ రామ’ కంటే బాగుంటుంది. కానీ రెండిటికి సమానమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే ‘గేమ్ చేంజర్’ ఎందుకు ‘వినయ విధేయ రామ’ లాగా ఆడలేకపోయింది?, ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము. ‘వినయ విధేయ రామ’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, అందులో కొన్ని సన్నివేశాలు బాగా పేలాయి. హీరో ని ఎలివేట్ చేస్తూ చాలా సన్నివేశాలు ఉన్నాయి. భారీ ఫైట్ సన్నివేశాలు ఈ సినిమాకి బలం. అదే ‘గేమ్ చేంజర్’ చిత్రంలో అలాంటివి ఏమి లేవు. కేవలం పొలిటికల్ సబ్జెక్టు మీదనే సినిమా మొత్తం నడుస్తూ ఉంటుంది. ఒక్కటంటే ఒక్క హై సన్నివేశం కూడా లేదు. ఇంటర్వెల్ సన్నివేశం పర్వాలేదు అనిపించింది కానీ, ఆ తర్వాత మొత్తం ఫ్లాట్ గానే ఉంటుంది.
మన టాలీవుడ్ లో ఒక కమర్షియల్ సినిమా సక్సెస్ అవ్వాలంటే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు కనీసం రెండు మూడైన ఉండాలి. అప్పుడే డిజాస్టర్ టాక్ వచ్చినా ఇలాంటి పండుగ సమయంలో కనీస స్థాయి వసూళ్లను రాబడుతాయి. వినయ విధేయ రామ లో అవి ఉన్నాయి, ‘గేమ్ చేంజర్’ లో లేదు. అందుకే రెండు సినిమాల మధ్య ఇంత వ్యత్యాసం ఏర్పడింది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం కూడా ‘వినయ విధేయ రామ’ కోవకి చెందిన సినిమానే. ఈ చిత్రం లో సంక్రాంతికి ఒక సినిమా ఆడాలంటే ఏవేవి ఉండాలో, అవన్నీ ఉన్నాయి. అందుకే ఈ చిత్రం కూడా 70 శాతం కి పైగా రికవరీ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈరోజుటితో ‘గేమ్ చేంజర్’ చిత్రానికి 110 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయి. ఇది దాదాపుగా ఇక క్లోజింగ్ కలెక్షన్స్ లెక్క వేసేసుకోవచ్చు.