Marraige Life : ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులోనే జరగాలని పెద్దలు అంటుంటారు. అయితే ఈమధ్య యువత అసలు సరైన వయస్సుకి పెళ్లి చేసుకోవట్లేదు. అసలు చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. పెళ్లి చేసుకుంటేనే జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. లేకపోతే లైఫ్ వేస్ట్ అని చాలా మంది అంటుంటారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో పెళ్లి అనేది మోస్ట్ మర్చిపోలేని సంఘటన. కొంతమంది దీని కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అప్పటి రోజుల్లో తల్లిదండ్రులు పెళ్లి ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేసేవాళ్లు. కానీ ఈరోజుల్లో మా పిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ జనరేషన్ వాళ్లు పెళ్లికి తెగ భయపడుతున్నారు. సింగిల్‌గా జీవితాంతం ఉంటాం. కానీ పెళ్లి మాత్రం చేసుకోమని బల్ల గుద్దినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లి కానీ అమ్మాయిలు, అబ్బాయిలు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అసలు దీనికి కారణమేంటి? యువత పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండాలని నిర్ణయించుకోవడానికి కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
జీవనశైలిలో మార్పుల వల్ల యువత ఎక్కువగా ఇండిపెండెంట్‌గా ఉండటంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు. పెళ్లి వయస్సు వచ్చే సరికి లైఫ్‌లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. వీటివల్ల కొందరు పెళ్లికి నిరాకరిస్తున్నారు. అలాగే చదువు, జీవితంలో మంచి ఉద్యోగం, ఆర్థికంగా స్థిర పడాలంటే సంసార జీవితానికి దూరంగా ఉంటేనే అవుతుందని నమ్ముతున్నారు. ఉదాహరణకు ఓ వ్యక్తికి నెలకు 15 వేల జీతం వస్తుందని అనుకోండి. తనకి పెళ్లి వయస్సు వచ్చిన చేసుకోలేడు. ఎందుకంటే ఆ జీతంతో తనని పోషించుకోవడమే కష్టం. అలాంటిది కుటుంబాన్ని నడపడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఈరోజుల్లో అన్నింటి ధరలు పెరిగాయి. పెళ్లయితే సంబరమా.. ఆ తర్వాత పిల్లలు పుడతారు. ఇంకా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. పెళ్లి చేసుకున్న భార్యకు, పుట్టిన పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వలేమనే భయంతో కొందరు పెళ్లికి నిరాకరిస్తున్నారు. అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి ఉద్యోగంతో పాటు ఆస్తి, అందం అన్నీ ఉంటేనే ముందడుగు వేస్తున్నారు.
ఈరోజుల్లో పెళ్లి చేసుకుని కలిసి ఉండేవాళ్ల కంటే విడిపోయే వాళ్ల ఎక్కువమంది ఉన్నారు. వీటికి ముఖ్య కారణం అర్థం చేసుకునేంత మనసు లేకపోవడం, సర్దుకుపోయే గుణం లేకపోవడం, వివాహేతర సంబంధాలు పెరిగిపోవడం, వెస్ట్రన్ కల్చర్‌కి బాగా అలవాటు పడటం వంటివి చెప్పుకోవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్న, ఇంట్లో కుదిర్చిన సంబంధం అయిన పెళ్లయిన కొన్ని రోజులకే గొడవలు పడి, విడాకులు తీసుకుంటున్నారు. వీటిని చూసిన యువత విడిపోయేదానికి పెళ్లి చేసుకోవడం ఎందుకని భావిస్తున్నాయి. అలాగే పెళ్లయిన తర్వాత కూడా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో చాలామందికి ప్రేమ, పెళ్లి మీద రోజురోజుకీ నమ్మకం పోతుంది. దీనివల్ల కూడా యువత పెళ్లిని స్కిప్ చేస్తున్నారు. ఈతరం యువత ఎక్కువగా ఒంటరి జీవితానికి అలవాటు పడ్డారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్నాం. ఇకపై కూడా ఉండిపోతామనే భావనలో పెళ్లికి నో చెబుతున్నారని నిపుణుల అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Young people skipping marriage in life what are the reasons for this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com