మనలో చాలామంది తరచూ ఏటీఎం కార్డులను ఉపయోగిస్తూ ఉంటారు. బ్యాంకు లావాదేవీల కోసం ఎక్కువమంది ఏటీఎం కార్డులను వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎం కార్డును పోగొట్టుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పోగొట్టుకున్న ఏటీఎం కార్డు వల్ల ఖాతా ఖాళీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఎస్బీఐ ఏటీఎం కార్డును పోగొట్టుకుంటే ఏం చేయాలనే ప్రశ్నలకు సంబంధించి ఎస్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
పాత డెబిట్ కార్డ్ ను బ్లాక్ చేయడంతో పాటు కొత్త డెబిట్ కార్డును ఏ విధంగా పొందవచ్చో ఎస్బీఐ వెల్లడించింది. ఏటీఎం కార్డును పోగొట్టుకున్న వాళ్లు మొదట ఎస్బీఐ టోల్ ఫ్రీ నంబర్ అయిన 1800 1234 నంబర్ కు కాల్ చేయాలి. సూచనలలో పేర్కొన్న విధంగా నిర్ధిష్ట అంకెలను నొక్కుతూ ఉండాలి. ఏటీఎం కార్డును బ్లాక్ చేయాలని అనుకుంటే నంబర్ 0 నొక్కాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, కార్డ్ నంబర్ ను ఉపయోగించి కార్డును బ్లాక్ చేయడానికి 1 నొక్కాలి.
రిజిష్టర్డ్ మొబైల్ నంబర్, అకౌంట్ నంబర్ ను ఉపయోగించి కార్డును బ్లాక్ చేయాలని భావించే వాళ్లు 2 నొక్కాలి. ఆ తర్వాత ఖాతా నంబర్ లోని చివరి ఐదు నంబర్లను ఎంటర్ చేసి 1 నంబర్ నొక్కడం ద్వారా కార్డును బ్లాక్ చేయాలి. చివరి ఐదు నంబర్లు తప్పుగా ఎంటర్ చేసి ఉంటే 2 నొక్కడం ద్వారా ఆ వివరాలను సరి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఎస్బీఐ ఏటీఎం కార్డును సులభంగా బ్లాక్ చేయవచ్చు.
ఆ తరువాత సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కొత్త ఏటీఎం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఏటీఎం కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.