Anger management tips: ప్రతి మనిషిలో కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిలో సంతోషం, దుఃఖం, ప్రేమ.. వీటితోపాటు కోపం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తికి నచ్చని పని జరిగినప్పుడు.. లేదా నచ్చని వస్తువులు చూసినప్పుడు అతనికి కోపం వస్తుంది. తనకు అన్యాయం జరిగిందని.. ఎవరో అవమానించారని.. తన పనులు పూర్తి చేయలేని సమయంలో కోపం ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా లేనప్పుడు.. పూర్తిగా నిద్ర లేనప్పుడు.. హార్మోన్ల సమతుల్యం లోపించినప్పుడు ఈ లక్షణం బయటపడుతుంది. అయితే కోపం వల్ల కొన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఒక పనిని సీరియస్ గా పూర్తి చేస్తారు. కానీ ఈ కోపం వల్ల ఎక్కువగా నష్టమే జరుగుతుంది. ఆ నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం..
గుర్తింపు:
కోపం ఎక్కువగా ఉండటం వల్ల సమాజంలో గుర్తింపును కోల్పోతారు. ఎందుకంటే కోపం ఉన్న వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడరు. అంతేకాకుండా కోపం ఉన్న వారి దగ్గరికి ఎవరు రాకుండా జాగ్రత్త పడతారు. వారితో కనీసం మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు. దీంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతుంటారు. ఎవరి మద్దతు ఉండకపోవడంతో ఉద్యోగుల సైతం కార్యాలయాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులకు కోపం ఉండడం వల్ల తమ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
కుటుంబ వ్యవస్థ:
ఒక కుటుంబంలో ఇంటి పెద్ద లేదా ఇంట్లోని ఆడవాళ్లకు కోపం ఉండడంవల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఏదైనా విషయం చెప్పడానికి ముందుకు రారు. కొన్ని రహస్యాలను వారు ఎప్పటికీ దాస్తూ ఉంటారు. అంతేకాకుండా కోపం ఉండడంవల్ల మాట్లాడడానికి ఇష్టపడరు. దీంతో కుటుంబ సభ్యుల మనసు అర్థం చేసుకోలేక పోతారు.
వ్యక్తిగత అభివృద్ధికి ఆటంకం:
ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటాడు. ఇందుకోసం ఎంతో కష్టపడతాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరి వరకు చేరిన అతడికి ఒకవేళ కోపం వస్తే వ్యవస్థ ఒకసారి గా కుప్పకూలిపోతుంది. ఎందుకంటే ఒక చిన్న కోపం ద్వారా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అప్పటివరకు నిర్మించుకున్న సామ్రాజ్యం అంతా కూలిపోతుంది. అందువల్ల ఎదుగుతున్న వ్యక్తులకు కోపం ఉండకుండా జాగ్రత్త పడాలి.
హ్యాపీ లైఫ్:
కోపంగా వ్యక్తులు జీవితంలో సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పటికీ కోపం ఉన్న వ్యక్తితో ఎవరూ మాట్లాడలేరు. వారి దగ్గరికి కనీసం చూడడానికి కూడా రారు. ఇలాంటి వారితో మాట్లాడడానికి భయపడతారు. అంతేకాకుండా ఎప్పుడూ కోపంతో ఉన్న వ్యక్తి ఏవేవో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మనసు ప్రశాంతతను కోల్పోతుంది. ప్రతి పనిని కోపంతో పూర్తి చేయాలని అనుకుంటారు. కానీ అలా సమయానికి పూర్తి చేయలేకపోవడంతో మరింత కోపం వచ్చి సంతోషకరమైన జీవితాన్ని కోల్పోతారు.
అయితే ప్రతి మనిషికి కోపం తప్పనిసరిగా అవుతుంది. వారిని అదుపులో చేసుకున్నప్పుడే జీవితం సుఖమయం అవుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే కోపంగా వ్యక్తికి తన జీవితం నాశనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శాంతంగా ఉండే వ్యక్తి అనుకున్న స్థాయిలో ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకే తన కోపమే తనకు శత్రువు.. మన శాంతమే తనకు రక్ష అని అంటారు.