Relationship advice for couples: ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు సంతోషకరంగా ఉండాలంటే వారి మధ్య ఎలాంటి భేదాలు ఉండకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకునే విధంగా నడుచుకోవాలి. అలా ఉండేవారు స్నేహితులు కావచ్చు.. భార్యాభర్తలు కావచ్చు.. ఎవరైనా కలకాలం కలిసి ఉండాలంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోతూ ఉండాలి. అయితే ఎంత ప్రయత్నించినా.. ఒక్కోసారి పొరపొచ్చాలు రావడం సహజం. ఇలాంటి సమయంలో వారితో బంధం కొనసాగించాలని అనుకుంటే ఒక్క మెట్టు దిగి క్షమించడం అలవాటు చేసుకోవాలి. అలా క్షమించడం లేదా తప్పును ఒప్పుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
తప్పు ఎవరైనా చేయొచ్చు.. కానీ దానికి పశ్చాత్తాపం పడే ధైర్యం ఉండాలి. చాలామంది తప్పు చేసినా కూడా.. తమదే రైట్ అని వాదిస్తూ ఉంటారు.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎన్నో సంవత్సరాల ఉన్న బంధం ఈ ఒక్క విషయంలో ఇది పోయే అవకాశం ఉంటుంది. అయితే బంధం లేదా స్నేహం ఒకసారి ఏర్పడిన తర్వాత జీవితాంతం కలిసి ఉండాలని అనుకునేవారు కొన్ని విషయాల్లో ఒక అడుగు వెనుక వేయాలి.
భార్యాభర్తల మధ్య ఎన్నో రకాల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అయితే ఎవరో ఒకరు తప్పు చేయకుండా ఉండరు. ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పుచేసి పశ్చాత్తాపానికి గురైయితే వెంటనే వారిని క్షమించడం మేలు. అలా కాకుండా తప్పు చేశారని పదేపదే నిందిస్తే.. వారు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత తప్పు చేయని వారు బాధపడాల్సి వస్తుంది. అందువల్ల తప్పు చేసిన వారిని క్షమించే ప్రయత్నం చేయాలి.
ఒకరు తప్పు చేసినప్పుడు వారు చెప్పే విషయాన్ని పూర్తిగా వినాలి. వారు ఏ పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వస్తుందో అర్థం చేసుకోవాలి. అలా ఎదుటివారిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మరోసారి అలాంటి తప్పు చేయొద్దని సున్నితంగా చెప్పాలి. అప్పుడు మీపై భాగస్వామికి నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఒక్కోసారి ఒకరు తప్పు చేస్తే మరొకరికి కోపం వస్తుంది. అయితే కోపం ఉన్న సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే కోపంలో తీసుకునే నిర్ణయాలు అప్పుడు అయి ఉంటాయి. వీటివల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా బంధాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కోపం ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి.
ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడినప్పుడు ఒకరు చేసిన తప్పును మరొకరు పదేపదే నిందించడం మానుకోవాలి. అలాగే తప్పు చేసిన వారు ఒక్కోసారి క్షమించే గుణం ఉండకపోవచ్చు. ఇలాంటి వారిని మొదటిసారిగా క్షమించే ప్రయత్నం చేయాలి. కానీ మరోసారి అలాంటి తప్పు చేస్తే మాత్రం హెచ్చరించే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎదుటివారికి నమ్మకం ఏర్పడుతుంది.
కొందరు తాము తప్పు చేసిన క్షమిస్తారు.. అని ఆలోచనతో ఉంటారు. ఇలాంటివారు ఆ ఆలోచన మానుకోవడం మంచిది. పదేపదే తప్పు చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.