Yoga Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి నేటి కాలంలో అనేక రకాల మెడిసిన్స్ వాడుతున్నాడు. అయితే ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ అయి కొత్త రోగాలకు దారితీస్తున్నాయి. కొన్ని అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి మెడిసిన్ కాకుండా యోగా, రకరకాల ఆసనాలు వేయాలని పూర్వకాలంలోనే పెద్దలు చెప్పారు. అయితే వీటిని కొందరు పాటిస్తూ వస్తున్నారు. యోగా చేయడం ద్వారా శరీరం అదుపులో ఉంటుంది. అలాగే ఇదే సమయంలో ఆసనాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నేటి కాలంలో ఆసనాలు చేసే అంత సమయం లేదని కొందరు అంటూ ఉంటారు. కానీ ఇదే సమయంలో ముద్రాసనాలు చేస్తూ ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ముద్రాసనాలు చేయడానికి ప్రత్యేకంగా సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇతరులతో మాట్లాడుతూనే ఈ ఆసనాలు వేయొచ్చు. వీటిలో హాకిని ఆసనం గురించి ప్రత్యేకంగా చర్చిద్దాం.
భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెస్లా కంపెనీ అధినేత ఎలా మస్క్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వీరు ఎప్పుడైనా కూర్చొని ప్రసంగం వింటున్నప్పుడు వారి చేతులను చూశారా? వారు తమకున్న ఒక చేతి ఐదు వీళ్లను మరో చేతికి ఉన్న ఐదువేలతో సమానంగా ఉంచుతూ కూర్చుంటారు. దీనిని ఎవరూ పట్టించుకోరు. కానీ ఇది ఒక ఆసనం అని గుర్తుంచుకోవాలి. దీనిని హాకిని ఆసనం అని అంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడైనా కూర్చుని సమయంలో ఈ ఆసనం తప్పనిసరిగా వేస్తుంటారు
హాకిని ఆసనం వేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడైనా మనసు భారంగా అనిపించినప్పుడు.. ఏదైనా కోల్పోయినప్పుడు.. తీవ్ర నిరాశ ఎదురైనప్పుడు.. ఇలాంటి ఆసనం వేయడం వల్ల మెదడు ఉత్తేజితంగా మారుతుంది. అంతేకాకుండా అప్పటివరకు మీరు ఎదుర్కొనే సమస్య నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది. మొత్తంగా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒక చేతి ఐదు వేళ్లను .. మరో చేతి ఐదు వేల తో ఆనించి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల.. శరీరంలోని అన్ని అవయవాలలో కదలిక ఉంటుంది. దీంతో మెదడులోకి రక్తప్రసరణ జరిగి ఉత్తేజితంగా మారుతుంది. ఫలితంగా మెదడు కొత్త ఆలోచనలు కోరుతుంది. దీంతో అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
హాకిని ఆసనం వేయడానికి ప్రత్యేకంగా సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు.. సమావేశంలో కూర్చున్నప్పుడు.. కనీసం 30 నిమిషాల పాటు ఈ ఆసనం వేయడం వల్ల అనుకున్న ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ప్రతిరోజు 30 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల నిత్యం ఉత్తేజితంగా మారిపోతారు. ఇవే కాకుండా ఎన్నో రకాల ఆసనాలు వేయడం ద్వారా శరీరాన్ని అనారోగ్యం నుంచి తప్పించుకుని అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది వీటిని పట్టించుకోరు. కానీ ఒకసారి ప్రయత్నిస్తే తప్పులేదు. ప్రతిరోజు 30 నిమిషాల పాటు వివిధ రకాల ఆసనాలు వేసి చూడండి.. కొన్ని రోజుల తర్వాత తప్పకుండా ఫలితాన్ని పొందుతారని పెద్దలు చెబుతున్నారు.