
Kadamba Tree : మన దేశంలో ఉన్న ఆచారాల్లో చెట్టు, జంతువులు, పక్షులు పూజిస్తాం. ఈనేపథ్యంలో వేప, మర్రి, తులసి, రావి వంటి చెట్లను పూజిస్తూనే ఉంటాం. ఒక్కో చెట్టుకు ఒక్కో విశిష్టత ఉంటుంది. అందుకే చెట్లలో కూడా దేవుళ్లను చూస్తాం. రావి చెట్టు శ్రీకృష్ణుడికి ప్రతీకగా భావిస్తాం. బిల్వ వృక్షం శివుడికి ఇష్టంగా చెబుతుంటారు. ఇలా ఒకో చెట్టుకు ఒకో దేవుడికి ప్రీతిపాత్రమైనదిగా గుర్తిస్తాం. ఇది ఇప్పటి నుంచి వచ్చే ఆచారం కాదు. పూర్వం నుంచే వస్తోంది. ఇక జంతువుల్లో ప్రధానంగా ఆవుకు పూజలు చేస్తాం. సాక్షాత్తు అమ్మవారుకు ప్రతిరూపంగా కొలుస్తాం. దీంతో దేశంలోని ఆచారాల్లో వీటిని పూజించడం మనకు గొప్ప వరంగా చెబుతుంటాం.
కదంబ వృక్షం
ఇంతకీ కదంబ వృక్షం ఎప్పుడైనా చూశారా? ఇది కేవలం అడవుల్లో మాత్రమే కనిపిస్తుంి. దీని ప్రత్యేక ఏంటంటే ఇది ఏడాది పొడవునా పచ్చగానే ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడికి ఇష్టమైన చెట్టుగా చెబుతారు. అడవుల్లో ఉండటంతో మనకు పెద్దగా తెలీదు. దీని మహిమలు మాత్రం అపారం. దీన్ని పూజిస్తే సకల పాపాలు పోతాయట. దీని పువ్వులు సర్కిల్ ఆకారంలో గుండ్రంగా ఉంటాయి. దీని కలపను బొమ్మల తయారీలో వాడతారు. ఉత్తర భారతదేశంలో కృష్ణ వృక్షం అని, దక్షిణ వృక్షం అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.

దీనికి ఎలా పూజ చేయాలి
ఈ చెట్టుకు ఓం శక్తి స్వరూపిణియే అని మంత్రం జపిస్తూ పూజించాలి. గ్రహ దోషాలు ఉన్న వారు అమ్మవారి స్వరూపంగా భావించి దీనికి పసుపు, కుంకుమ తో పూజిస్తే చాలా మంచిదట. ఇలా చేయడం వల్ల మనకు శుభాలే కలుగుతాయి. కానీ ఇది అడవుల్లో ఉండటంలో అక్కడకు వెళ్లాలంటేనే భయం. తోడు లేనిదే వెళ్లడానికి ఉండదు. దీని వల్ల మహిళలు అడవులకు వెళ్లలేక దీనికి పూజలు చేయడం లేదు. కానీ దొరికితే దీనికి పూజలు చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలిగి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.
చెట్టును ఎలా గుర్తించాలి
అడవుల్లోనే ఉండటంతో సులభంగానే గుర్తించవచ్చు. పైగా ఏడాదంతా పచ్చగా ఉండటంతో ఎండాకాలంలో అయినా పచ్చగానే ఉంటుంది. దీంతో ఈ చెట్టును మనం సులభంగానే గుర్తు పట్టవచ్చు. కాకపోతే అడవిలోకి సరిగా దారి ఉండదు. చెట్టు, పుట్టలు దాటుకుంటూ వెళ్లాలి. ఒకరు కాదు గుంపుగా వెళితేనే భయం లేకుండా ఉంటుంది. ఒకరైతే వెళ్లలేరు. సామూహికంగా వెళితే పూజలు చేసుకుని తమ కోరికలు కోరుకోవచ్చు. మహిళలు మూకుమ్మడిగా వెళ్లి కదంబ వృక్షాన్ని గుర్తించి పూజలు చేసుకోవడం మంచిదే.