
World Test Championship: ‘టీం ఇండియాను సొంతగడ్డపై ఎలా ఎదుర్కొవాలో మాకు తెలుసు. స్పిన్నర్లను సమసర్థవంతంగా ఎదుర్కొంటాం. మా వ్యూహాలు మాకు ఉన్నాయి’ భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు చెప్పిన మాటలివీ. ఇండియాలో అడుగు పెట్టి.. సిరీస్ ప్రారంభమయ్యాక ఆ జట్టు ఏదశలోనూ పోటీ ఇవ్వలేక చతికిల పడతోంది. నాలుగు మ్యాచ్‌ల బోర్డర్–గవాస్కర్ ట్రోఫీని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. రెండింటిలోనూ భారత జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది. బలమైన స్పిన్‌తో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లను మూడు రోజుల్లోనే ముగించింది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్ దృష్టి..
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ద్వారా టీం ఇండియా రెండు ఫీట్లు సాధించబోతోంది. అందులో ఒకటి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లడం. ఈ ఫీట్‌ను తొలి టెస్ట్ విజయంతోనే సాధించింది. రెండోది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లడం.
మిగతా రెండు మ్యాచ్‌ల్లో..
బోర్డర్ – గావాస్కర్ టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు వరుసగా రెండు టెస్టులను ఓడిపోవడంతో 66.67 శాతానికి పడిపోయింది. ఇప్పుడు భారత్ విజయాల శాతం 64.06 శాతానికి చేరింది. దీంతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం మాత్రం జరగదు. మిగతా రెండు మ్యాచ్‌లను డ్రా చేసినా చాలు భారత్ ఫైనల్‌కు చేరుతుంది. ఆసీస్‌పై రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ కనీసం 3–1 ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకొంటే ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఫైనల్‌కు చేరుకున్నట్టే. ప్రస్తుతం 66.67 శాతంతో ఉన్న ఆసీస్ సిరీస్ కోల్పోయినప్పటికీ కనీసం ఒక్క టెస్టు గెలిచినా.. భారత్‌తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అడుగు పెడుతుంది.
మూడు ఫార్మాట్లలో నంబర్ వన్..
ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత్‌దే అగ్రస్థానం. వరుసగా వన్డేలు, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుని మరీ టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. ఇప్పుడు టెస్టు ర్యాకింగ్స్‌పై టీమ్‌ఇండియా దృష్టిసారించింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలన్నా.. ఐసీసీ టాప్ ర్యాంక్‌కు చేరుకోవాలన్నా ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీసే కీలకమనే విషయం తెలిసిందే. కనీసం 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటే చాలు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ భారత్ అగ్రస్థానానికి చేరుకొనేందుకు వీలుఉంది. ఇప్పటికే 2–0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆసీస్ 126 పాయింట్లతో తొలి ర్యాంక్‌లో ఉండగా.. భారత్ 115 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కేవలం 11 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలవడంతో దాదాపు అగ్రస్థానానికి టీమ్‌ఇండియా చేరువైంది. మరో రెండు రోజుల్లో ర్యాంకుల గణాంకాలను ఐసీసీ అధికారికంగా విడుదల చేస్తుంది. మూడో టెస్టును భారత్ గెలిస్తే అగ్రస్థానాకి చేరుతుంది. 4–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టాప్ ర్యాంక్ భారత్ సొంతమవుతుంది. ఆసీస్ ర్యాంకు దిగిజారుతుంది.

ఎలా గెలిస్తే ఏం జరగుతుంది?
– నాలుగు టెస్టుల తర్వాత 2 – 0తో భారత్ గెలిస్తే.. చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలుస్తాం.
– 3 – 0తో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరతాం.
– 3 – 1తో సిరీస్‌ను గెలిచినా ఫైనల్‌కు చేరుకోవడం ఖాయం.
– 4 – 0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే భారత్ డబ్ల్యూటీసీలో తొలి ఫైనలిస్ట్‌గా మారుతుంది. అప్పుడు ఆసీస్ అవకాశాలు న్యూజిలాండ్ – శ్రీలంక సిరీస్‌పై ఆధారపడి ఉంటుంది.
మొత్తంగా బోర్డర్ – గవాస్కర్ సిరీస్ ఫలితాలను ఏరకంగా విశ్లేషించినా, మిగతా రెండు మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఖాయం.
