
Mahesh-Trivikram Movie Leak: ఎస్ఎస్ఎంబి 28 నెక్స్ట్ షెడ్యూల్ కి మహేష్ సిద్ధం అవుతున్నారు. దీని కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఒక విలాసవంతమైన ఇంటికి సంబంధించిన సెట్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. అక్కడే నిరవధికంగా కొన్ని రోజుల చిత్రీకరణ జరపనున్నారు. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆగస్టు రిలీజ్ టార్గెట్ గా చిత్రీకరణ జరుపుతున్నారు. అనుకున్న ప్రకారం షూటింగ్ జరిగినట్లయితే సమ్మర్ లో విడుదలయ్యేది. కొన్ని కారణాలతో షూటింగ్ డిలే అయ్యింది.
కాగా ఎస్ఎస్ఎంబి 28 మూవీకి సంబంధించి కీలక విషయం లీకైంది. ఈ చిత్రంలో లేడీ కానిస్టేబుల్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటున్నారట. ఆమె ఎవరో కాదు… భూమి పెడ్నేకర్. పలు హిట్ చిత్రాలు, సిరీస్లలో నటించిన భూమి పెడ్నేకర్ కి టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా ఫేమ్ ఉంది. అలాగే రఫ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ పోలీస్ పాత్రకు ఆమె బాగా సెట్ అవుతారని మేకర్స్ నమ్ముతున్నారట. ఈ క్రమంలో ఆమెను ఎంపిక చేశారట.
అలాగే ఎస్ఎస్ఎంబి 28 పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేసే అవకాశం కలదు. ఈ క్రమంలో నార్త్ ప్రేక్షకులకు తీసిన కాస్ట్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా భూమి పెడ్నేకర్ కి ఛాన్స్ ఇచ్చారట. మహేష్ మూవీ అనగానే ఎగిరి గంతేసి ప్రాజెక్ట్ కి ఒప్పుకున్నారట. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.

ఎస్ఎస్ఎంబి 28లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీలీల మరో హీరోయిన్ గా చేస్తున్నారు. శ్రీలీల పాత్రపై ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 13 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ మూవీ చేస్తున్నారు. అలాగే ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వీరి కాంబినేషన్ లో రూపొందాయి. అతడు తెలుగు ఆడియన్స్ ఆల్ టైం ఫేవరేట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు మహేష్-రాజమౌళి చిత్రం కూడా ఇదే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. రాజమౌళి వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు.
