జాతీయంఆఫీసుకు ర‌మ్మంటే.. ఉద్యోగులు ఏమంటున్నారో తెలుసా?

ఆఫీసుకు ర‌మ్మంటే.. ఉద్యోగులు ఏమంటున్నారో తెలుసా?

Work For Home‘‘ఉద్యోగుల‌ను ఆఫీస్ కు పిల‌వాలా? ఇంటి నుంచే ప‌ని చేసుకోమ‌ని చెప్పాలా?’’ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల‌కు ఇదో స‌మ‌స్య‌గా మారింది. క‌రోనా సెకండ్ వేవ్ విజృంభించ‌డంతో.. కంపెనీల‌న్నీ ఉద్యోగుల‌ను ఇళ్ల‌కు పంపించేశాయి. ఇంటి నుంచే ప‌నిచేయాల‌ని కోరాయి. అయితే.. క‌మ్యునికేష‌న్ గ్యాప్ రావ‌డం.. వ‌ర్క్ ఔట్ పుట్ లో తేడాలు రావ‌డంతో.. ఆఫీస్ నుంచి ప‌ని చేస్తేనే బాగుంటుంద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాయి చాలా కంపెనీలు. ప్ర‌ముఖ ఐటీ సంస్థ‌ల‌న్నీ ఉద్యోగుల‌ను ఆఫీస్ కు పిల‌వ‌డానికే సిద్ధ‌మ‌య్యాయి. అయితే.. ఉద్యోగులు మాత్రం మ‌రో విధంగా ఆలోచిస్తున్నారు.

క‌రోనా భ‌యం ఇంకా తొల‌గిపోలేదు. థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కేంద్రం రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉంది. నీతి ఆయోగ్, ఎస్బీఐ వంటి సంస్థ‌లూ థ‌ర్డ్ వేవ్ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లి ప‌నిచేయ‌డానికి చాలా మంది ఉద్యోగులు వెన‌క‌డుగు వేస్తున్నారు. లండ‌న్ కు చెందిన ప్రైజ్ వాట‌ర్ హైజ్ కూప‌ర్స్ అనే సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది ఉద్యోగుల‌నుంచి ఈ విష‌య‌మై అభిప్రాయాలను సేక‌రించింది.

దీని ప్ర‌కారం.. 41 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు రావ‌డానికి విముఖ‌త చూప‌స్తున్నార‌ట‌. భార‌త్ కు చెందిన ఓ ప్ర‌ముఖ ఇంట‌ర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ కూడా ఆగ‌స్టులో లో రెండు ల‌క్ష‌ల మందిని స‌ర్వే చేసింది. ఇందులో ఏకంగా 48 శాతం మంది ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కే ఓటు వేయ‌డ‌మే కాకుండా.. వీరంతా శాశ్వ‌తంగా ఇంటి నుంచే ప‌నిచేసే అవ‌కాశం ఇస్తే బాగుంటుంద‌ని అంటున్నార‌ట‌!

ఇంటి నుంచి ప‌నిచేస్తున్న వారిలో చాలా మంది సొంత ఊళ్ల‌కు వెళ్లిపోయారు. హైద‌రాబాద్ లో ప‌నిచేసే వారిని తీసుకుంటే.. దాదాపు 40 శాతం ఐటీ ఉద్యోగులు న‌గ‌రాన్ని వ‌దిలి వెళ్లారు. ఇలాంటి వారంతా తిరిగి.. న‌గ‌రానికి చేరుకోవ‌డానికి సంశ‌యిస్తున్నారు. వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్లీ థ‌ర్డ్ వేవ్ వంటిది మొద‌లైతే.. ఇబ్బందిక‌రమ‌ని భావిస్తున్నార‌ట‌. అయిన‌ప్ప‌టికీ.. రావాల్సిందేన‌ని కొన్ని కంపెనీలు ఆదేశిస్తే.. కొంద‌రు సీనియ‌ర్లు ఉద్యోగం వ‌దిలేసి, వేరే సంస్థ‌కు వెళ్లేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారట‌! ఈ విధంగా.. ఆఫీసుకు పిలిస్తే అయిష్ట‌త వ్య‌క్తం చేస్తున్నారు దాదాపు సగం మంది ఉద్యోగులు! ఇలాంటి ప‌రిస్థితుల్లో.. వారిని ఆఫీసుకు పిల‌వ‌డం స‌వాల్ గానే మారింది సంస్థ‌ల‌కు!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Most Popular

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...

Polymer Currency Notes : దేశంలో ఇక ప్లాస్టిక్ కరెన్సీ..! RBI భారీ అడుగు.. పాకిస్తాన్ కు...

Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత...

After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే..

After Meal Tips: ప్రస్తుతం చాలామందికి భోజనం చేసిన వెంటనే కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉంటున్నారు. ఇవి లేకపోతే వారికి మానసికంగా సంతృప్తి అనిపించదు. అయితే ఇవి సాధారణంగా కనిపించినా.. దీర్ఘకాలంలో...

Stress Relief: రోజులో 24 నిమిషాలు ఇలా చేస్తే.. ఒత్తిడి మాయం..

Stress Relief: ప్రస్తుత కాలంలో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, సామాజిక ఒత్తిళ్లు వంటి అనేక కారణాలతో మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ఆరోగ్యాన్ని కంటే...
Exit mobile version