
Women’s Premier League 2023: ఎన్నాళ్ళో వేచిన క్షణం రానేవచ్చింది. ఐపీఎల్ తరహాలోనే మహిళలకూ ఓ టోర్నీ ఉండాలని, మహిళా క్రికెటర్లకు అవకాశాలు మెరుగవ్వాలని ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతున్నాయి. బీసీసీఐ చొరవతో అడ్డంకులన్నీ అధిగమించి డబూ‍్ల్యపీఎల్-2023 శనివారం నుంచి మొదలు కాబోతోంది. 18 రోజుల పాటు మ్యాచ్‌లు జరగనుండగా.. సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లని నిర్వహించబోతున్నారు. అన్ని మ్యాచ్‌లూ ముంబయిలోని రెండు స్టేడియాల్లోనే జరుగుతాయి. టోర్నీలో పోటీపడబోతున్న ఐదు జట్లకీ ఇప్పటికే కెప్టెన్లని ప్రకటించారు.
ముంబైలోనే అన్ని మ్యాచ్‌లు..
భారత్ గడ్డపై శనివారం నుంచే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభంకాబోతున్నాయి. టోర్నీలో మొత్తం ఐదు జట్లు పోటీపడుతుండగా.. మార్చి 4 నుంచి మార్చి 26 వరకూ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకి, రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. అన్ని మ్యాచ్‌లనూ ముంబయిలోని డీవై పాటిల్, బ్రబౌర్న్ స్నేడియాల్లోనే బీసీసీఊ నిర్వహించబోతోంది. మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో డబుల్ హెడర్ మ్యాచ్‌లు నాలుగు మాత్రమే. మార్చి 4 నుంచి మార్చి 21 వరకూ లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మార్చి 24న ఎలిమినేటర్, మార్చి 26న ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది.
పోటీపడబోతున్న ఐదు జట్లు
టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడబోతున్నాయి. ప్రతి జట్టూ లీగ్ దశలో ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుండగా.. రెండు, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో పోటీపడుతుంది.
ఐదుగురు కెప్టెన్లు వీరే..
ముంబయి ఇండియన్స్ టీమ్‌ని కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నడిపించనుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి కెప్టెన్‌గా స్మృతి మంధన ఎంపికైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కి మెక్ లానింగ్, గుజరాత్ టైటాన్స్‌కి బెత్ మూనీ, యూపీ వారియర్స్‌కి హీలీ కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యారు. శనివారం ఫస్ట్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. డబ్ల్యూపీఎల్-2023 సీజన్ మ్యాచ్‌లు వయాకామ్ 18 చానల్‌లో ప్రసారంకానున్నాయి. ఆన్‌లైన్‌లో జియో సినిమా లేదా స్పోర్ట్స్ 18 టీవీలో వీక్షించొచ్చు.

మొత్తానికి తొలిసారిగా 18 రోజులపాటు మహిళా క్రికెట్ పండుగ జరుగబోతోంది. అనేక ఆటంకాలు దాటుకుని మొదలవుతున్న డబ్ల్యూపీఎల్‌కు ఐపీఎల్ తరహాలో ఆదరణ ఉంటుందో లేదో వేచి చూడాలి.