Director Chandu Mondeti ; అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. థియేట్రికల్ ట్రైలర్ ని చూసిన తర్వాత మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా అనిపించింది. దానికి తోడు మూవీ టీం మొత్తం చేస్తున్న నాన్ స్టాప్ ప్రొమోషన్స్ ఈ సినిమా మీద అంచనాలు రోజురోజుకి పెంచేలా చేసాయి. నాగ చైతన్య సినిమాకి ఇంతటి భారీ అంచనాలు ఏర్పడడం గతంలో ‘లవ్ స్టోరీ’ కి మాత్రమే జరిగింది. ఇందులో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ముందుగా తెలుగు లో మాత్రమే ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ, సినిమాకి మంచి డిమాండ్ ఉండడంతో తమిళం, హిందీ లలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఈ రెండు భాషలకు ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి తమిళం కి కార్తీని, హిందీ కి అమీర్ ఖాన్ ని పిలిపించారు. గతంలో లవ్ స్టోరీ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అమీర్ ఖాన్ ముఖ్య అతిథి గా విచ్చేశాడు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కి కూడా ఆయన ముఖ్య అతిథి గా వచ్చాడు కాబట్టి హిట్ అవుతుందనే సెంటిమెంట్ నాకుంది అని నాగ చైతన్య హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ ‘ప్రేమించుకునే ఏ ఇద్దరు అయినా ఈ చిత్రాన్ని రిపీట్స్ లో థియేటర్స్ కి వచ్చి చూస్తారు. ఎందుకంటే హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ప్రతీ ప్రేమికుల నిజ జీవితానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. వాళ్ళ లవ్ స్టోరీ ని వెండితెర మీద చూసిన అనుభూతి కలుగుతుంది. అలాంటి అనుభూతి కలగకపోతే నేను నా పేరు మార్చుకుంటా’ అంటూ సవాల్ విసిరాడు.
ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. శ్రీకాకుళం లోని డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన ఒక జాలరి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పాత్రలో లీనం అవ్వడానికి నాగ చైతన్య ఆ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి జనాల భాష, యాస, అలవాట్లను నేర్చుకున్నాడు. డైరెక్టర్ కూడా చాలా రీ సెర్చ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దేశభక్తి అంశం అంతర్లీనంగా ఉంటూనే, హృదయాలకు హత్తుకునే విధంగా లవ్ స్టోరీ ప్రేక్షకులను కంటతడి పెట్టేలా చేస్తుందని అంటున్నారు. సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. రీసెంట్ గానే దుబాయి లో ప్రివ్యూ షో వేయగా, అక్కడి ఆడియన్స్ నుండి కూడా ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మరి మన ఆడియన్స్ కి ఈ చిత్రం ఎంత వరకు నచ్చుతుందో చూద్దాం.