Women : డబ్బు సంపాదించడం కొందరికి చాలా సులువైన పని. కానీ దానిని రెట్టింపు చేయడం కొందరు మాత్రమే చేస్తారు. వచ్చిన డబ్బులు బ్యాంకులో దాచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ డబ్బులు రకరకాల మార్గాల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అధికంగా లాభాలు పొందవచ్చు. అయితే ఈ పెట్టుబడులు సొంతంగా ఉపయోగపడడంతో పాటు కుటుంబానికి కూడా మేలు చేసేలా ఉంటే చాలా బెటర్ అని కొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో మహిళల కోసం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీం ఒకటి అందుబాటులో ఉంది. ఇందులో 25 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నవారు నెలకు రూ.1000 పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో సొంత అవసరాలతో పాటు కుటుంబానికి కూడా ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. ఆ స్కీం వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుత కాలంలో చాలామంది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కంటే టర్న్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే కరోనా తర్వాత ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. అందువల్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల తమ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే టర్మ్ ఇన్సూరెన్స్లో రకరకాలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని నెలల ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ప్రమాదం జరిగితే తప్ప ఆ మొత్తం మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేదు. అయితే 65 లేదా 70 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకునే అవకాశం కొన్ని సంస్థలు ఇస్తున్నాయి.
Also Read : మహిళలు ఇలా చేస్తే మహారాణులే.. మహిళలు ఇంట్లో నుంచి డబ్బులు సంపాదించడానికి మార్గాలు ఇవే…
అయితే ఈ ఇన్సూరెన్స్ కేవలం ఉద్యోగం చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్న యువతి తో పాటు మహిళలకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అవకాశాన్ని కల్పించారు. ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వారికి జీవితంలో ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే కుటుంబానికి రూ. 2 కోట్ల రూపాయలు వరకు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా వారికి 25 నుంచి 40 ఏళ్లలోపు కుమారులు లేదా కుమార్తెలు ఉంటే వారికి నేల నేల 50 వేల వరకు కొన్ని రోజులపాటు సంస్థలు ఇవ్వనున్నాయి. అయితే 70 సంవత్సరాల వరకు ఎటువంటి అపాయం జరగకుండా ఉన్న కట్టిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే అవకాశం ఉంది.
ఈ ఇన్సూరెన్స్ లో ఎలాంటి జిఎస్టి లేదా ఇతర టాక్స్లు పడే అవకాశం లేదు. అంతేకాకుండా ఒకప్పుడు కేవలం ఉద్యోగం చేసే వారికి మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు భర్త ఆధ్వర్యంలో గృహిణులు కూడా ఈ ఇన్సూరెన్స్లో తీసుకుంటే అనేక రకాలుగా ప్రయోజనాలు ఉండనున్నాయి. అయితే ఈ రకమైన ఇన్సూరెన్స్ లు అనేక కంపెనీలు చాలా రకాలుగా అందిస్తున్నాయి. దీనిని సూపర్ ఇన్కమ్ అనే అంటున్నారు. కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఇన్సూరెన్స్ తో అనేక రకాలుగా టాక్స్ రిటర్న్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.