AP Government : ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న పశుసంవర్ధక రంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రంలో పాడి రైతుల ఆదాయం పెరిగేలాగా ఒక డాష్ బోర్డును మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పశువుల వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పశువుల షెడ్లకు పన్ను రద్దు చేయడం అలాగే గడ్డి పెంపకానికి ఆర్థిక సహాయం అందించడం వంటి పథకాలను రైతుల కోసం ప్రకటిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తుంది. రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా విజయవాడ నగరంలో జరిగిన గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో జరిగిన పశుసంవర్ధక టెక్ ఏ ఐ 2.0 సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న పాడి రైతుల ఆదాయం పెంచే ముఖ్య లక్ష్యంతో ఒక డాష్ బోర్డును ప్రారంభించారు.
ఈ క్రమంలో ఆయన రైతులు మరియు వ్యాపారులు చెప్పిన సమస్యలపై స్పందించారు. ఈ క్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏస్మా పరిధిలోకి అన్ని రకాల పశువైద్య సేవలను తీసుకొని వస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను సమీపించి అవసరం లేని చట్టాలను తొలగిస్తామని కూడా అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పశువుల కోసం ఏర్పాటు చేసిన చెడులకు వెంటనే ఆస్తి మరియు ఇంటి పన్ను రద్దు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ అంబులెన్స్ గురించి అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. మొబైల్ అంబులెన్స్ ప్రభుత్వం చేయలేకపోతే వాటిని ప్రైవేటు రంగానికి అప్పగిస్తామని రాష్ట్ర ప్రజలకు అవసరమైన సమయంలో వాటిని అందుబాటులో ఉంచేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read : టాలీవుడ్ కు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
అదేవిధంగా వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని కల్పించి గడ్డి పెంపకానికి అర ఎకరం వరకు డబ్బులను అందజేస్తామని తెలిపారు. రైతులకు పొదుపు సంఘాల ద్వారా గడ్డి ని పెంచి సరఫరా చేస్తామని ఈ విషయం గురించి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడతానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలకు మాగుడు గడ్డిని అందుబాటులో ఉంచేలాగా చూస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో కలిసి విద్యార్థులు ప్రాజెక్టులు చేసేలాగా చూస్తామని తెలిపారు.