Gujarat woman Maniben: పాలు అమ్మి పైకి వచ్చినా.. అని తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి అప్పుడప్పుడు ప్రసంగంలో చెబుతూ ఉంటారు. చాలామంది దీనిని టేకిటీజీగా తీసుకున్నారు. మరికొందరు మాత్రం ఆయన స్ఫూర్తిగా పాల వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే పాల వ్యాపారం ప్రారంభించడం.. దానిని అభివృద్ధి చేయడం అంటే ఆషామాషీ కాదు. కష్టపడి పని చేయడం.. స్థిరమైన మార్కెట్ను ఏర్పాటు చేసుకోవడం.. సాంకేతికను ఉపయోగించి పాల ఉత్పత్తిలో కొత్త పద్ధతులు వంటివి పాటించడం వల్ల పాల ఉత్పత్తిలో ఆనుకున్న దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. అయితే ఒక మహిళ ఇలాంటివి అన్ని పాటించి ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్ కు లేని ఆదాయం ఈ మహిళకు వస్తుందంటే ఎవరూ నమ్మరు.. కానీ ఈ స్టోరీ చదివిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆమె ఎలా సంపాదిస్తుందంటే?
గుజరాత్ లోని గిరి సోమనాథ్ ప్రాంతానికి చెందిన మనీ వెన్ అనే మహిళ సాధారణ గృహిణి. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను చూసిన తర్వాత తాను కూడా ఏదైనా ఒక పని చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మొదటగా ఆమె రెండు ఆవులతో పాల ఉత్పత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె మార్కెట్లోకి తీసుకెళ్లిన పాలకు మంచి ఆదరణ రావడంతో పాల ఉత్పత్తిని పెంచడం ప్రారంభించింది. ఇందులో భాగంగా పశువులకు సరైన ఆరోగ్య అవసరాలు ఏర్పాటు చేస్తూ.. వాటికి అవసరమైన పోషకాహారాలను అందిస్తూ.. నూతన పద్ధతులను అవలంబించేది. సాంకేతికంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వాటికి పౌష్టిక ఆహారాన్ని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. ఇలా పశువులకు మేలైన ఆహారాన్ని అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరిగింది.
ఆ తర్వాత ఆమె స్థిరమైన మార్కెట్ను ఏర్పాటు చేసుకున్నారు. అంటే స్థానిక రైతులతో కలిసి కో-ఆపరేటివ్ విధానం ద్వారా పనిచేయడం.. వారితో కలిసి పాలను నేరుగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి వారికి విక్రయించేది. దీంతో ప్రతిరోజు పాలకు డిమాండ్ ఉండడంతో స్థిరమైన ఆదాయం వచ్చేది. ఇలా రోజుకు రూ వెయ్యి నుంచి 1200 లీటర్ల వరకు పాలను సేకరించి విక్రయించేది. ఇలా ప్రతి ఏడాదికి ఆమె రూ. రెండు కోట్ల ఆదాయాన్ని పొందుతోంది.
పాల వ్యాపారంతో మనిబెన్ మాత్రమే కాకుండా గ్రామస్తుల్లో కొందరికి ఉపాధిని కల్పిస్తోంది. కేవలం పాలను మాత్రమే విక్రయించడం కాకుండా పాలతో తయారు చేసే పదార్థాలను కూడా మార్కెట్కు సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగా ఆధునిక చిల్లింగ్ యూనిట్, టెస్టింగ్ సిస్టం, హైజిన్ ప్రోటోకాల్ వంటివి అమలు చేయడం వల్ల ఈ పాలకు అత్యంత గుర్తింపు లభించింది. దీంతో కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఇక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయి. ఈ విధంగా మనిబెన్ చూపిన చొరవతో అందరూ ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా మహిళలకు ఈ పాల డైరీ ద్వారా ఉపాధి లభించడంతో వారు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రస్తుత కాల మహిళలకు మనీ వెన్ ఎంతో స్ఫూర్తిదాయకమని కొందరు ప్రశంసిస్తున్నారు.