New rental rules 2025: సిటీకి లేదా నగరానికి కొత్తగా వచ్చిన వారు.. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు.. ముందుగా గదిని లేదా షెటర్ అద్దెకు తీసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఇలా అద్దెకు తీసుకునే క్రమంలో ఓనర్, టెనెంట్ మధ్య సత్సంబంధాలతో మాట మీదే అగ్రిమెంట్ జరిగేది. కానీ కాల క్రమంలో అద్దె రేట్లు పెరిగిపోవడంతో పాటు కొన్ని కారణాల వల్ల ఓనర్, టెనెంట్ ల మధ్య విభేదాలు వస్తున్నాయి. ఈ విభేదాలు కోర్టు వరకు వెళ్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రంలో అద్దె చట్టం అనేది లేదు. కానీ రాష్ట్రాల వారీగా మెడల్ టెనెన్సీ చట్టం మారుతూ ఉంటుంది. ఈ క్రమంలో 11 నెలల కంటే ఎక్కువ కాలం అద్దెకు ఉంటే ఓనర్, టెనెంట్ మధ్య ఒప్పందం చేసుకోవాలి. ఈ ఒప్పందం ఇప్పటి వరు అగ్రిమెంట్ పేపర్ పై మాత్రమే ఉండేది . కానీ 2025 లో అద్దెచట్టంలో కొన్ని కొత్త నిబంధనలు వచ్చాయి. ఇవి ఓనర్, టెన్యూస్ కు ఉపయోగపడే విధంగా .. అలాగే ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉండే విధంగా ఉన్నాయి. మరి కొత్త అద్దె చట్టంలో ఏమేం ఉన్నాయంటే?
2025లో సంవత్సరంలో ప్రభుత్వం Model Tenancy Act పేరుతో కొత్త నియమాలను చేర్చింది. ఈ చట్టం ప్రకారం ఇంటి ఓనర్, అద్దెకు ఉండేవారి మధ్య కొన్ని ఒప్పందాలను మార్చింది. కొత్తగా అద్దెకు వచ్చేవారు ఒకప్పుడు కేవలం అగ్రిమెంట్ మాత్రమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం సూచించిన కార్యాలయంలో డిజిటల్ ఒప్పందం చేసుకోవాలి. ఇది మాన్యువల్ గా ఉండొచ్చు లేదా ఆన్ లైన్ లో కూడా రిజిష్టర్ చేసుకోవచ్చు. ఇలా రిజిష్టర్ చేసుకునే క్రమంలో డిజిటల్ స్టాంప్ కచ్చితంగా ఉండాలనే నిబంధన ఉంది.
కొత్తగా అద్దెకు తీసుకునేవారు సాధారణంగా అడ్వాన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఓనర్లు ఇష్టం వచ్చినట్లు ఆరు నెలలు లేదా ఏడాది అద్దెను ముందుగానే తీసుకుంటున్నారు. కానీ ఇక నుంచి కేవలం రెండు నెలల అడ్వాన్స్ మాత్రమే తీసుకోవాలి. అలాగే కొందరు ఓనర్లు తమకు నచ్చిన విధంగా అద్దెలను పెంచుతూ ఉన్నారు. కానీ కొత్త రూల్స్ ప్రకారం కేవలం ఏడాదికి ఒక్కసారి అది కూడా 5 నుంచి 10 శాతం వరకు మాత్రమే అద్దె పెంచేందుకు అనుమతి ఉంది.
ఓనర్లు లేదా టెనెంట్ లకు ఇల్లు నచ్చకపోతే.. ఓనర్లు వెంటనే ఖాళీ చేయమని చెప్పేవారు. అలాగే టెనెంట్ కూడా వెంటనే ఖాళీ చేయడానికి ఆస్కారం లేదు. ఓనర్లు 90 రోజుల ముందు అంటే మూడు నెలల ముందే ఖాళీ చేయమని చెప్పాలి. ఒకవేళ టెనెంట్ ఖాళీ చేయాలని అనుకుంటే నెల ముందే ఓనర్ కు చెప్పాలి. ఇల్లు ఖాళీ చేసే సమయంలో ఏదో ఒక గొడవ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య పరిష్కరించుకోవడానికి ఇప్పటి వరకు పెద్ద మనుషుల మధ్య అంగీకారం ఉండేది. కానీ ఇప్పుడు కోర్టులో ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యేకంగా అద్దె సమస్యలను పరిష్కరిస్తుంది.