How is cinnamon extracted: మనం రోజు తినే ఆహారంలో సాధారణ పదార్థాల కంటే వాటిలో అదనంగా ఉపయోగించే పదార్థాలతోనే ఆరోగ్యం ఉంటుంది. ప్రతిరోజు అన్నంతో పాటు తీసుకునే కూరలో రకరకాల పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాల్లో ప్రోటీన్లు కలిగినవి.. శరీరానికి మేలు చేసినవి ఉండడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే కూరల్లో ఉపయోగించే పదార్థాల్లో దాల్చిన చెక్క గురించి ప్రత్యేకంగా వినే ఉంటారు. మసాలా దినుసుల్లో భాగమైన దాల్చిన చెక్క మాంసాహార కూరల్లో వేయడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా దాల్చిన చెక్క వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దాల్చిన చెక్కను ఎలా సేకరిస్తారు? ఇది ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతుంది? అనే వివరాల్లోకి వెళితే..
ప్రపంచవ్యాప్తంగా దాల్చిన చెక్కకు ఎక్కువగా ఆదరణ ఉంది. ఇది Cinnamomum zeylanicum అనే ప్రత్యేకమైన చెట్టు నుంచి వస్తుంది. ఈ చెట్టు పెరిగిన తర్వాత దాని బెరడును తీసి ఎండబెడతారు. మొదట కొమ్మలను కత్తిరించి కొమ్మలపై ఉన్న రఫ్ లేయర్లు తొలగిస్తారు. ఆ తర్వాత లోపలి మెత్తటి సువాసన గల బెరడును జాగ్రత్తగా తీసి ఎండలో ఆరబెడతారు. ఇలా ఎండలో ఆరబెట్టిన తర్వాత అది రోల్ లాగా చుట్టుకుంటుంది. ఆ తర్వాత దీనిని మార్కెట్లోకి తీసుకు వస్తారు.
దాల్చిన చెక్క ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో సి, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. శరీరంలోని చక్కెరను నియంత్రించడంలో దాల్చిన చెక్క ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు దీనిని ఉపయోగిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే జీర్ణ సమస్య ఉన్నవారు సైతం దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడం, గుండె సంబంధిత సమస్యలను పరిష్కరించే పనిలో దాల్చిన చెక్క ముందుంటుంది. అయితే మసాలా దినుసు కావడంతో దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకోవడం వల్ల అల్సర్ తయారయ్యే అవకాశం ఉంటుంది
ప్రపంచవ్యాప్తంగా దాల్చిన చెక్కను అత్యధికంగా శ్రీలంక, ఇండోనేషియా, వియత్నం, చైనా వంటి దేశాల్లో లభ్యమవుతుంది. శ్రీలంకలోని సిలోన్ దాల్చిన చెక్క అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో కేరళ, తమిళనాడు లో దాల్చిన చెక్క చెట్లు కనిపిస్తాయి. కానీ మన దేశంలో అవసరమైన అంత లభ్యం ఉండదు కాబట్టి ఎక్కువగా ఇండోనేషియా, వియత్నాం దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు.
దాల్చిన చెక్కను కేవలం కూరల్లో మాత్రమే కాకుండా పానీయాల్లో కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఉదయం దాల్చిన చెక్క టీ తాగడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మెదడు షార్ప్ గా మారి మంచి ఆలోచనలు వస్తాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు దాల్చిన చెక్కను నేరుగా కూడా తినవచ్చు. అయితే మార్కెట్లో రెండు రకాల దాల్చిన చెక్కలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రోల్ లాగా ఉండే దాల్చిన చెక్క ఎక్కువగా ధర ఉంటుంది. సాధారణ దాల్చిన చెక్క కూడా ఉంటుంది. అందువల్ల ఇందులో క్వాలిటీ ది తీసుకోవాలి.