https://oktelugu.com/

Alcohol : ప్రతిరోజూ పెగ్గు అయినా ప్రమాదమే.. ఎందుకో తెలుసా?

మరికొందరు మాత్రం అల్కహాల్ ఎలా తీసుకున్నా ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొన్ని అధ్యయనాల ప్రకారం మాత్రం అల్కహాల్ ప్రతిరోజూ పెగ్గు తీసుకుంటే ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశోధనలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

Written By:
  • Srinivas
  • , Updated On : September 13, 2024 / 01:21 AM IST

    Alcohol

    Follow us on

    Alcohol :  ‘మద్యపానం హానికరం’ అని చాలా మంది.. చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. కానీ మానసిక ప్రశాంతత కోసం… ఒత్తిడి నుంచి దూరం కావడానికి మద్యం తప్పనిసరి అని కొందరి అభిప్రాయం.అందువల్ల కొందరు వీకెండ్స్ లో మద్యం సేవిస్తుంటారు. మరికొందరు మాత్రం ప్రతిరోజూ అల్కహాల్ తీసుకోకుండా నిద్రపోరు. అయితే ప్రతిరోజూ రెండు పెగ్గులు తాగడం వల్ల గుండెకు ఆరోగ్యం అని వైద్యులు చెబుతున్నారని కొందరు మీడియాలో చెబుతూ ఉన్నారు. మరికొందరు మాత్రం అల్కహాల్ ఎలా తీసుకున్నా ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొన్ని అధ్యయనాల ప్రకారం మాత్రం అల్కహాల్ ప్రతిరోజూ పెగ్గు తీసుకుంటే ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశోధనలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

    మనిషి ఆలోచనలను మళ్లించేందుకు అల్కహాల్ ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఒత్తిడి నుంచి దూరం కావడానికి మద్యం సేవిస్తూ ఉంటామని చెబుతూ ఉంటారు. అయితే కొందరు దీనిని వ్యసనంగా చేర్చుకొని ప్రతిరోజూ మద్యం సేవిస్తూ ఉంటారు. మద్యం లేకుండా నిద్రపోని వారు చాలా మంది ఉంటారు. అందుకే మిగతా వ్యాపారాల కంటే మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. అల్కహాల్ తీసుకున్న శరీరంలో ముందుగా కాలేయం దెబ్బతింటుంది అని అంటారు. కాలేయం దెబ్బతినడానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా మద్యం తీసుకోవడమే అని హెచ్చరిస్తున్నారు. అది ఒక్క పెగ్గు అయినా నష్టమే అని వివరిస్తున్నారు.

    అల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 4 రోజుల పాటు క్రమం తప్పకుండా 90 ఎంఎల్ కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే కాలేయం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కాలేయంపై ప్రభాదం చూపుతుంది. అయితే 4 రోజుల తరువాత తాగడం ఆపేస్తే కాలేయం పనిచేసి కొవ్వును లేకుండా చేస్తుంది. అంటే మద్యం తీసుకున్న వ్యక్తి కొన్ని రోజుల పాటు గడువు ఇవ్వడం వల్ల కాలేయం పై పెద్దగా ప్రభావం చూపదని అంటున్నారు.

    అలా కాకుండా ప్రతిరోజూ పెగ్గు చొప్పున మద్యం తీసుకుంటే కాలేయం చుట్టూ పేరకుపోయిన కొవ్వు మరింతగా పెరిగిపోతుంది. ఇది కాలేయంను పనిచేయకుండా చేస్తుంది. ఇదే క్రమంలో హైపటైటిస్ బి పెరిగిపోవడంతో కాలేయం పూర్తిగా పనిచేయకుండా పనిచేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థపై దెబ్బతిని ప్రాణాంతకం కావొచ్చు. అందువల్ల ప్రతిరోజూ క్రమం తప్పకుండా పెగ్గు తీసుకున్నా నష్టమే అని కొందరు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

    మద్యం సేవించని వారిలోనూ ఇలాంటి సమస్యలు రాలేదని చెప్పలేం. ఎందుకంటే కల్తీ నూనె, ఇతర ఆహార పదార్థాలు తినడం వల్ల కాలేయం పనిచేయకుండా ఉంటుంది. కానీ నాణ్యమైన ఆహారం తీసుకుంటూ ప్రతిరోజూ మద్యం తాగడం వల్ల కాలేయంపై దాడి చేసిన వారే అవుతారని అంటున్నారు. అందువల్ల వీకెండ్ లో మద్యం తీసుకున్నా.. కొన్ని రోజుల పాటు గడువు ఇవ్వాలి. లేదా అప్పుడప్ప్పుడు మద్యం తీసుకోవాలే తప్ప ప్రతిరోజూ పెగ్గు తీసుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అంతేకాకుండా మద్యానికి ప్రత్యామ్నాంగా ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు.