Travel Sickness: మనలో చాలా మంది ప్రయాణం చేసే సమయంలో వాంతులు చేసుకుంటారు. ప్రయాణమంటేనే భయపడతారు. వాంతుల భయంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. అసలు వాంతులు ఎందుకు అవుతాయి. వైద్య పరిభాషలో దీన్ని ఏమంటారు? అనే విషయాలపై ఓ సారి దృష్టి సారిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. కొందరికి బస్సుల్లోనే వెళితే వాంతులు అవుతాయి. మరికొందరికి ఆటోల్లో, రైళ్లల్లో వెళ్లినా వాంతులు కావడం తెలిసిందే. ఇంకొందరికి కారులో ఏసీ వేసినా వాంతులు అవుతుంటాయి. వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్ సిక్నెస్ అంటారు.

కొందరికి దూరం ప్రయాణించాక వాంతులు అవుతుంటే కొన్ని సందర్భాల్లో ప్రయాణం మొదలు పెట్టగానే అవుతాయని తెలుస్తోంది. మరికొందరికి ఎత్తుపల్లాలు ఉంటే వాంతులు రావడం తెలిసిందే. పాడైపోయిన రోడ్లలో వెళ్తున్నప్పుడు కుదుపులకు వాంతులు రావడం సహజమే. మోషన్ సిక్నెస్ అనేది ఆడవారిలోనే అధికంగా కనిపిస్తుంది. రెండు ఏళ్ల నుంచి పన్నెండేళ్ల వరకు ఉన్న పిల్లల్లో కూడా వాంతుల సమస్య కనబడుతుంది. ఈ నేపథ్యంలో వాంతులు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మహిళల్లో సెన్సిటివ్ నెస్ ఎక్కువగా ఉండటం వల్లే వాంతులు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా బస్సుల్ల వెళ్లేటప్పుడే వాంతులు వస్తాయి. మోషన్ సిక్నెస్, కార్ సిక్నెస్, సీ సిక్నెస్, ఎయిర్ సిక్నెస్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ప్రయాణం చేసే సమయంలో తల తిరుగుతూ వాంతులు వస్తుంటాయి. దీంతో వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనబడటంతో వారు ప్రయాణాలంటేనే వెనకడుగు వేస్తారు. తమకున్న సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

వాంతులు రావడానికి ఇంకా కొన్ని కారణాలు ఉంటాయని తెలుస్తోంది. మన చెవిలో ఉండే ఓ సున్నితమైన భాగమే దీనికి ప్రధాన కారణంగా చెబుతుంటారు. అందుకే ప్రయాణాల్లో వాంతులు రావడం మామూలే. కానీ మహిళలు వాంతులు రాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకా కొందరికైతే కారులో వెళ్లినా వస్తాయి. రైళ్లు, ఆటోల్లో వెళ్తుండగా కూడా వాంతులు వస్తే వారి పరిస్థితి దారుణంగా ఉండటం తెలిసిందే. వాంతులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారిస్తే మంచిది.
Also Read:Koratala Siva- Ram Charan: కొరటాల కి రామ్ చరణ్ మరో చాన్స్..భయపడిపోతున్న ఫాన్స్