Sunday Holiday: ఆదివారం ఈ పేరు వినడానికి ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆదివారం సెలవు దినం కనుక ప్రతి ఒక్కరు వారం రోజులు ఎంతో కష్ట పడుతూ ఈ ఆదివారం కోసం ఎదురుచూస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ చాలా ఆలస్యంగా నిద్రలేవడం ఆ రోజు మొత్తం ఎంతో సంతోషంగా గడపడం చేస్తుంటారు.ఇలా ఆదివారం కోసం మిగతా ఆరు రోజులు ఎంతో ఎదురుచూస్తూ కష్టపడుతూ పనిచేసేవారు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే వారంలో ఇన్ని రోజులు ఉండగా కేవలం ఆదివారం మాత్రమే ఎందుకు సెలవు దినంగా ప్రకటించారనే విషయానికి వస్తే…
పురాణాల ప్రకారం ఆదివారం ఎంతో విశిష్టమైన దినంగా భావిస్తారు.ఈ క్రమంలోనే ఆదివారం సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనది కనుక ఈ ఆదివారాన్ని రవివారం అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలోనే ఆదివారం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచిశుభ్రంగా స్నానం చేసి సూర్యభగవానుడికి తర్పణాలు వదిలి నమస్కరించడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని భావిస్తారు. ఆదివారం సూర్యనమస్కారాలు చేయడం వల్ల జ్ఞానం కలుగుతుందని భావిస్తారు. ఇక ఏదైనా శుభకార్యాన్ని ఆదివారం ప్రారంభించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో భారతీయులు ఆదివారానికి ఇచ్చే ప్రాముఖ్యతను గమనించిన బ్రిటిష్ వారు మనకు కూడా ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు.
Also Read: పవన్ కళ్యాణ్.. అమావాస్య చంద్రుడేనా?
అయితే అప్పటికే ఇతర దేశాలు క్రైస్తవ మతాన్ని ఆచరించేవారు ఆదివారం సెలవు దినంగా ప్రకటించకున్నారు. ఆదివారాన్ని విశ్రాంతి దినంగా భావించే వారు కనుక మనకు కూడా ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉద్యోగస్తులు,పాఠశాలలకు కూడా ఆదివారం సెలవు దినంగా ప్రకటించడంతో ప్రతి ఒక్కరు ఆదివారం ఇంటి దగ్గరే ఉంటారు. ఇలా ఎంతో పవిత్రమైన ఈ ఆదివారాన్ని చివరికి ఒక నాన్ వెజ్ డేగా మార్చుకున్నాము.ప్రస్తుతం ఆదివారం వచ్చిందంటే చాలు ఎక్కువగా మాంసాహారాలు చేసుకొని తింటూ ఆ రోజు మొత్తం గడుపుతున్నాము. నిజానికి ఆదివారం ఎలాంటి పరిస్థితులలో కూడా మాంసాహారం ముట్టుకోకూడదు అని పండితులకు తెలియ చేస్తున్నారు.
Also Read: యూపీలో బీజేపీకి ఓటేయని వారి ఇళ్లను బుల్ డోజర్లతో తొక్కిస్తాం: రాజాసింగ్ హెచ్చరిక