Bappi Lahiri songs for Megastar : ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి కొద్ది సేపటి కిందట ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. ఆయన మనమధ్య లేరన్న విషయం సంగీత లోకం జీర్ణించుకోలేకపోతుంది. అయితే ఆయన మ్యూజిక్ చేసిన పాటలు మాత్రం ఆయయ గుర్తులుగా మనమధ్యే ఉండిపోయాయి. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ బప్పిలహరి మంచి హిట్ సాంగ్స్ అందించారు. తెలుగులో సింహాసనం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్, చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన ఆలపించిన చల్తే చల్తే, డిస్కో డ్యాన్సర్ గీతాలు బాగా పాపులర్ అయ్యాయి. అయితే మిగతా హీరోల కంటే మెగాస్టార్ చిరంజీవితో బప్పిలహరి ఎక్కువగా సినిమాలకు మ్యూజిక్ ను అందించారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్, బప్పిలహరిల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగు సినీ పరిశ్రమకు దశాబ్దాలుగా సంగీతాన్ని, పాటలను అందించిన ఆయన లేడన్న వార్త విని విషాదంలో మునిగిపోయారు. అగ్రహీరోల కెరీర్ ను మలుపు తిప్పడంతో బప్పిలహరి కృషి చేశాడన్నది వాస్తవం. అయితే మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్టు హిట్టుగా నిలిచిన సినిమాలకు ఆయన మ్యూజిక్ అందించడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి 1989లో హీరోగా వచ్చిన స్టేట్ రౌడి సినిమాకు మొదటిసారిగా బప్పిల హరి సంగీతాన్ని అందించారు. ఇందులో తదిగినతోం.. వనటూ త్రీ.. చుక్కల పల్లకిలో.. అన్న పాటలు ఆకట్టుకుంటాయి. ఆ తరువాత 1991లో గ్యాంగ్ లీడర్ సినిమాకు కూడా బప్పిలహరి మ్యూజిక్ కంపోజ్ చేశారు. గ్యాంగ్ లీడర్ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తాయి. ఇందులో దాదాపు అన్ని పాటలు సక్సెస్ అయినవే. ఇందులో భద్రాచంల కొండా.. వానా వానా వెల్లువాయే.. వయసు వయసు.. పనిసాసససా.. పాపాప రీటా.. పాల బుగ్గ.. అన్న పాటలు హైలెట్ గా నిలిచాయి .
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
ఇక చిరంజీవి కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన రౌడీ అల్లుడు ఇదే సంవత్సరంలో వచ్చింది. ఈ సినిమాకూ బప్పిల హరే బాణాలను సమకూర్చారు. ఇందులోని సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. అమలాపురం బుల్లోడా.. కోరి కోరి కాలుతుంది ఈడు, లవ్ మీ హై హీరో, ప్రేమ గీమ తస్సాదియ్యా, తద్దినకా.. పాటలు హిట్టు కొట్టాయి. 1995లో చిరంజీవి మాస్ హీరోగా కనిపించి బిగ్ బాస్ కు ఈ మ్యూజిక్ డైరెక్టర్ పాటలను అందించారు. ఈ సినిమా సక్సెస్ కాకున్న అందులోని పాటలను మనం ఇప్పటికీ వింటూనే ఉంటాం. ఇందులోని ‘మావ మావ’ అన్న సాంగ్ సినీ ఇండస్డ్రీలోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అలాగే సూదికి దారం సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.
Also Read: నేడే మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తులు