Kalivi kodi: ఈ భూమిపై ఎన్నో జీవరాసులు మనుగడ సాగిస్తున్నాయనే విషయం మనకు తెలిసిందే.అయితే కొన్ని పక్షులు వాటికి అనుకూలంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళుతూ ఉండటం మనం చూస్తుంటాము. ఇలా ఈ భూమిపై ఎన్నో జీవరాసులు నివసిస్తున్నాయి. అలాంటి వాటిలో కలివికోడి ఒకటి. ఈ పక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో అరుదుగా కనిపించే ఓ అరుదైన పక్షి ఈ కలివికోడి. భారత పక్షి శాస్త్ర పితామహుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న ఈ పక్షి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.
Also Read: షర్మిల అరెస్టుతో ఏం జరుగుతోంది?
1986 జనవరి 5వ తేదీ ఐరయ్య అనే ఓ గొర్రెల కాపరి గొర్రెల కోసం వెళ్లి ఈ పక్షిని కనుగొన్నారు.ఇలా ఆ గొర్రెల కాపరి ఈ పక్షిని కనుగొనడం వల్ల ఈ కలివికోడి గురించి దేశం మొత్తం తెలుసుకున్నారు. ఇక ఆయన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఐరయ్యను వాచర్ గా గుర్తించింది. ఈ పక్షి ఆవాస ప్రాంతం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మించాలని భావించారు. ఇదే కనుక జరిగితే ఈ అరుదైన పక్షి జాతి అంతరించిపోతుందని పర్యావరణ కారులు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆపివేయాలని కోర్టులో పిటిషన్ వేశారు.
ఇక ఈ విషయంపై విచారణ జరిపిన కోర్టు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా ఈ కలివికోడి వల్ల ఏకంగా వంద కోట్లు ప్రాజెక్ట్ ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం నుంచి కాకుండా దారి మళ్ళించి నిర్మాణం చేపట్టారు.
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?