Morning Ritual: కొంతమందికి ఏదైనా మంచి లేదా చెడు జరిగితే.. నేను ఈరోజు పొద్దున లేచి ఎవరి మొహం చూసానో.. అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం పెద్దలకు చెబితే ఉదయం లేవగానే ఎవరి మొహం చూడొద్దు.. నీ అరచేతులను నువ్వే చూసుకో.. అయితే మన అరచేతిలో లక్ష్మీ దేవత ఉంటుందని.. మన చేతిని చూసుకోవడం వల్ల లక్ష్మీదేవిని చూసినట్లు అవుతుందని చెబుతారు. కొంతమంది దీనిని పట్టించుకోలేదు. అయితే దీని వెనక శాస్త్రీయ కారణం కూడా ఉందని కొందరు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం లేవగానే అరచేతిని చూసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
మానవ శరీరం ఆరోగ్యానికి సరైన నిద్ర చాలా అవసరం. కానీ కొంతమంది మానసిక సమస్యల వల్ల కంటి నిండా నిద్ర పోలేకపోతున్నారు. దీంతో ఉదయం లేవగానే మానసికంగా భారంగా ఉంటున్నారు. అయితే నిద్రపోయినప్పుడు కళ్ళు కూడా కదలిక లేకుండా ఉంటాయి. ఉదయం లేవగానే ఫోన్ లేదా టీవీ స్క్రీన్ చూస్తే కళ్ళు భారంగా మారిపోతాయి. దీంతో రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఉదయం లేవగానే అరిచేతిని చూసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.
మనిషి నిద్రపోయినప్పుడు మెదడులో స్లో వేవ్ స్లీప్, రాపిడిఐ మూమెంట్ దశల్లో ఉంటుంది. అయితే ఉదయం నిద్ర లేవగానే మెదడు యాక్టివ్ కావడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ సమయంలో కళ్ళకు సరైన వ్యాయామం జరిగితే కళ్ళ కదలికతో పాటు మెదడు కూడా సక్రమంగా పనిచేస్తుంది. ఇలా ఉదయం లేవగానే కళ్ళు కదలికగా ఉండాలంటే అరచేతిని చూసుకోవాలని అంటారు. చేతిలో అనేక నాడి రేఖలు ఉంటాయి. వీటిని చూడగానే మెదడుకు మృదువైన సిగ్నల్స్ అందుతాయి. దీనివల్ల డోపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు సమతుల్యం అవుతాయి. ఫలితంగా మానసికంగా ప్రశాంతత, సానుకూల భావన ఏర్పడుతుంది. అలాగే కళ్ళు అటు ఇటు కదపడం వల్ల కళ్ళకు వ్యాయామం లాగా అవుతుంది. దీంతో రోజంతా కళ్ళు అటు ఇటు చూసిన భారంగా అనిపించవు.
ఆధ్యాత్మికంగా చూసిన కూడా.. ప్రతి పనిని మనం చేతితోనే చేస్తుంటాం. ఇదే సమయంలో పూజలు కూడా చేస్తుంటాం. అందువల్ల అరచేతిలోనే దేవతలు కనిపిస్తారని చెబుతారు. అంతేకాకుండా మన చేతులను చూసుకోవడం వల్ల మనల్ని మనమే గౌరవించుకున్నట్లు అవుతుంది. ఇలా ఉదయం లేవగానే అరచేతిని చూసుకోవడం వల్ల ఆధ్యాత్మికంగానూ.. శాస్త్రీయపరంగానూ అనుకూల సంకేతాలు ఉంటాయని అంటున్నారు. అందువల్ల రోజంతా యాక్టివ్ ఉండాలంటే ఉదయం లేవగానే ఈ పని చేయాలని అంటున్నారు. అయితే కొంతమంది ఉదయం లేవగానే మొబైల్ మాయలో పడిపోతూ ఉంటారు. సాధ్యమైనంతవరకు బ్రేక్ ఫాస్ట్ వరకు మొబైల్ చూడకుండా ఉండడమే మంచిది.